బుల్డోజర్ ప్రభుత్వం : కాంగ్రెస్ అధ్యక్షుడిని కేటీఆర్ లేఖ

గత కొద్దిరోజులుగా తెలంగాణ లో '  హైడ్రా ( HYDRA)' ఆధ్వర్యంలో చెరువులు కుంటలను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్న సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

చిన్న పెద్ద అనే తేడా లేకుండా ' హైడ్రా ' ఈ కూల్చేతలకు పాల్పడుతోంది.

ఈ వ్యవహారంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులతో పాటు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నా,  ఎవరిని వదిలిపెట్టడం లేదు.

ఒక రకంగా తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి .ముఖ్యంగా ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy )దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

ఎవరు ఏ స్థాయిలో ఒత్తిడి తెచ్చినా తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తూ హైడ్రా అధికారులకు పూర్తి భరోసా ఇస్తూ వారికి అన్ని విధాలుగాను మద్దతు పలుకుతున్నారు.

తాజాగా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,  కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge) కు లేఖ రాశారు.

  ఈ లేఖలో కేటీఆర్ అనేక విమర్శలు చేశారు. """/" / దయచేసి తెలంగాణను మరో బుల్ డోజర్ రాజ్యాంగంగా మారకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని లేఖలో కేటీఆర్ కోరారు.

'' ప్రియమైన మల్లికార్జున ఖర్గే గారు మీరు చెప్పినట్లుగా ఒకరి ఇంటిని కూల్చివేసి , వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానీయం, అన్యాయం.

తెలంగాణలో చట్టం న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారం జరుగుతోంది.మహబూబ్ నగర్ పట్టణంలో పేదలకు చెందిన 75 ఇళ్ళను తెల్లవారుజామున మూడు గంటలకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు.

నిన్న అక్రమంగా కూల్చివేసిన 25 ఇళ్లల్లో నిరుపేదల కుటుంబాలు , శారీరక వికలాంగులు కూడా ఉన్నారు.

"""/" / సరైన పద్ధతులు పాటించకుండా విధివిధానాలు లేకుండా అమలు చేసే చట్టం చట్టమే కాదు.

అడ్డగోలుగా నిరుపేదల పైకి బుల్డోజర్ నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యాంగంగా మార్చకుండా ఆదేశాలు ఇవ్వండి '' అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్ లేఖ రాశారు.

ఏడాదికో సినిమాతో తారక్ అదిరిపోయే ప్లానింగ్.. ఈ హీరో ప్లానింగ్ అద్భుతం అంటూ?