తెలంగాణ అసెంబ్లీ వేదికగా కేంద్రంపై కేటీఆర్ విమర్శలు

తెలంగాణ అసెంబ్లీ వేదికగా కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.విశాఖ ఉక్కును కేంద్రం తుక్కు కింద అమ్ముతోందని తెలిపారు.

సింగరేణి విషయంలో కూడా కేంద్రం ఇదే వైఖరితో ఉందని కేటీఆర్ విమర్శించారు.కోల్ ఇండియా కంటే సింగరేణి ఎక్కువ ఉత్పత్తి చేస్తోందన్నారు.

దేశీయ బొగ్గును కొనుగోలు చేయొద్దొని కేంద్రం ఎవరి ప్రయోజనాల కోసం చెప్పిందని ప్రశ్నించారు.

మొదట గనులు ఇవ్వకుండా నష్టం వచ్చేలా చేస్తారన్న కేటీఆర్ గుజరాత్ కు నామినేషన్ పద్ధతిన ఇస్తారని విమర్శించారు.

గుజరాత్ కు నామినేషన్ పద్ధతిన ఇస్తారు కానీ సింగరేణికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ ఇండోనేషియా వెళ్తే వాళ్ల ఫ్రెండ్ కు గనులు వస్తాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

సీరియల్స్ సంపాదన చీరలకే సరిపోతుంది.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!