మోదీని పాఠాలు నేర్చుకోమంటున్న కేటీఆర్ !

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.దీంతో తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్, బిజెపిల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

ఇప్పటికే ఫ్లెక్సీల విషయంలో రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది.నగరంలో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గురించిన ఫ్లెక్సీలు నగరం అంతా దర్శనం ఇస్తున్నాయి.

దీనిపై బిజెపి మండిపడుతోంది.బిజెపి ఫ్లెక్సీలు కనిపించకుండా నగరమంతా ప్రధాన కూడళ్లలో టిఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

        ఇదిలా ఉంటే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మంత్రి కేటీఆర్ నేరుగా ప్రధానమంత్రిని ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు.

తెలంగాణకు వచ్చి తమ రాష్ట్రాన్ని చూసి పాఠాలు నేర్చుకోండి అంటూ కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన అజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడాలని కేటీఆర్ సూచించారు.

వినూత్న పథకాలు , నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి బిజెపి ఎన్నడూ చేరుకోలేదని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాలు చర్చిస్తారు అనుకోవడం అత్యాశేనని తెలుసునని కేటీఆర్ పేర్కొన్నారు.

బిజెపి నిర్వహిస్తున్న సమావేశాల్లో నిజమైన అజెండా విద్వేషమని,  అసలు సిద్ధాంతం విభజన అని అందరికీ తెలుసునన్నారు .

    """/"/   అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న మోడీకి ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యం ఉందని తాము అనుకోవడం లేదని చెప్పారు.

  అభివృద్ధి కోసం కృషి చేయాలని బిజెపి తెలుసుకోవడానికి తెలంగాణను మించిన ప్రదేశం ఇంకొకటి లేదని కేటీఆర్ సూచించారు.

విధానాలు,  ప్రాధాన్యాలను అధ్యయనం చేయాలని మోడీకి రాసిన లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు.డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో ప్రజలకు ట్రబుల్ విధానాలతో సమస్యలు ఎదుర్కొంటున్న బిజెపి పాలిత రాష్ట్రాల్లో మంచి పథకాలను అమలు చేసేందుకు ప్రయత్నించాలని కేటీఆర్ లేఖలో కోరారు.

అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన ఆలోచన విధానాలకు నాంది పలకాలని సూచించారు.

కేటీఆర్ లేకపోతే బీజేపీ నాయకులు స్పందించి విమర్శలు దాడి మొదలు పెట్టారు. .

బత్తాయి తోటల్లో పురుగుల ఉధృతి నివారణకు సమగ్ర సస్యరక్షక చర్యలు..!