అక్కడ ఎన్నిక కేటీఆర్ ఇజ్జత్ కా సవాల్ ? రంగంలోకి టీమ్ లు ? 

ఈటెల రాజేందర్ వ్యవహారం తెరపైకి వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైలెంట్ అయిపోయారు.

మిగతా విషయాలపై ఆయన యాక్టివ్ గానే ఉంటున్నా,  ఈటెల ఎపిసోడ్ లో జోక్యం చేసుకునేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.

అసలు తమకు సంబంధం లేని విషయం గానే ఆయన అభిప్రాయపడుతూ వచ్చారు.కానీ ఇక్కడ మాత్రం టిఆర్ఎస్, కెసిఆర్ ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నా,  మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు తప్ప కేటీఆర్ మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు.

అయితే ఇక్కడ మరికొద్ది నెలల్లో ఉప ఎన్నికలు రాబోతుండడం తో ఈటెలకు పట్టు చిక్కకుండా చేసేందుకు ఒక వైపు టిఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.

ముఖ్యంగా మంత్రి హరీష్ రావు ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు .అయితే హుజూరాబాద్ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండడంతో ఈ ఎన్నిక కేటీఆర్ కు ప్రతిష్టాత్మకంగానే మారిపోయింది.

నేరుగా కేటీఆర్ రంగంలోకి దిగకపోయినా, మంత్రులు ,తనకు అత్యంత సన్నిహితుల ద్వారా ఎప్పటికప్పుడు హుజురాబాద్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గురించి కేటీఆర్ ఆరాతీస్తున్నారు.

హుజురాబాద్ ఎన్నికల ప్రభావం రాబోయే సార్వత్రిక  ఎన్నికలపైనా ప్రభావం చూపించే అవకాశం ఉండటం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఈ ఉప ఎన్నిక ఫలితం కు బాధ్యత వహించాల్సి రావడం వంటి కారణాలతో కేటీఆర్ ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెంచారు.

ఇప్పటికే సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు మంత్రులను ఇన్చార్జిలుగా నియమించారు.

"""/"/ అయినా కేటీఆర్ తన సొంత టీమ్ ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

హుజూరాబాద్ నియోజకవర్గం లో చోటు చేసుకుంటున్న పరిణామాలను కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సమాచారాన్ని కేటీఆర్ కు అందిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ కు ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినా, కేటీఆర్ కూడా రంగంలోకి దిగడంతో ఈ ఎన్నికలను కేటీఆర్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అర్థమవుతోంది.

మొటిమల్లేని మెరిసే చర్మం కోసం ఈ మ్యాజికల్ రెమెడీని ప్రయత్నించండి..!