పులి కడుపున పులే పుడుతుంది.. కేటీఆర్ కొడుకు మంచితనానికి ఫిదా కావాల్సిందే!

దేశంలో చాలామంది దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది.అయితే ఆ డబ్బును సరిగ్గా ఖర్చు చేసే దానం చేసే మంచి గుణం కొంతమందికే ఉంటుంది.

చిన్న వయస్సులోనే కోట్ల రూపాయల డబ్బును మంచి పనుల కోసం ఖర్చు చేయాలంటే ఎంతో మంచి మనస్సు ఉండాలి.

కేటీఆర్( KTR ) కొడుకు హిమాన్షు( Himanshu ) తాజాగా తన మంచితనాన్ని చాటుకున్నారు.

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని తన మంచి మనస్సును చాటుకున్నారు.ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దారు.

హిమాన్షు సీఏఎస్ అధ్యక్షుడిగా( President Of CAS ) పాఠశాలలో సేకరించిన నిధులతో ఈ కార్యక్రమం చేపట్టగా నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

హిమాన్షు తాతకు తగ్గ మనవడని, పులి కడుపున పులే పుడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఐటీ శాఖా మంత్రిగా కేటీఆర్ ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. """/" / తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేటీఆర్ పడుతున్న కష్టం అంతాఇంతా కాదు.

విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ( Minister Sabitha Indra Reddy )చేతుల మీదుగా ఈ నెల 12వ తేదీన ఈ స్కూల్ ఓపెనింగ్ జరగనుంది.

హిమాన్షు కాలేజ్ లో చదువుకునే సమయంలో సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించడంతో పాటు అక్కడి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకునేవారు.

"""/" / హిమాన్షు భారీ మొత్తంలో సహాయం చేయడం వల్ల స్కూల్ యొక్క రూపురేఖలు పూర్తిస్థాయిలో మారిపోయాయి.

అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఈ స్కూల్ లో తమ పిల్లలను చదివించడానికి చాలామంది తల్లీదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.

హిమాన్షు ఇచ్చిన నిధులతో ఆట స్థలం, డైనింగ్ గది, మరుగుదొడ్ల నిర్మాణం, బెంచీలను ఏర్పాటు చేసినట్టు సమాచారం అందుతోంది.

రాబోయే రోజుల్లో హిమాన్షు మరిన్ని మంచి పనులు చేసి ప్రశంసలు అందుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రీమేకే కానీ ఒరిజినల్ కంటే బాగుండి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చంటి సినిమా..