కలవాల్సింది పార్టీలు కాదు ప్రజలు-కేటీఆర్

దేశ రాజకీయాలు నడపాలంటే ఢిల్లీలోనే ఉండాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు భారసా కార్యదర్శి ,రాష్ట్ర మంత్రి కేటీఆర్ ( K.

T.Rama Rao ).

దేశంలో ఇప్పటికి కూడా మరుగుదొడ్లు లేని ఇల్లు ఉన్నాయి అంటే అది ఇంతకాలం పాలించిన భాజపా కాంగ్రెస్ ల వైఫల్యం కాదా ? అంటూ ఆయన నిలదీశారు.

కాంగ్రెస్ భాజపాలు రెండూ ఒక తానులో గుడ్డలేనని , ఒకరిని ఓడించడం కోసం మరొకరితో చేతులు కలపలేమంటూ ఆయన చెప్పుకొచ్చారు .

మహారాష్ట్రలో విపక్ష కూటమి సమావేశాన్ని ఉద్దేశిస్తూ, కలవాల్సిందే ప్రజలు అని పార్టీలు కాదు అని ఆయన విమర్శించారు భాజపాకి బీ-టీం అని వస్తున్న విమర్శల పై స్పందించిన కేటీఆర్ నిజంగానే బారాసా భాజపాకు అనుకూలంగా పనిచేస్తున్నట్లయితే మా ఎమ్మెల్యేలు, ఎంపీలు పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు దాడులు చేస్తున్నాయి? అంటూ ఆయన ప్రశ్నించారు.

"""/" / ఇప్పటివరకు పరిపాలించిన ప్రధాన మంత్రులు అందరిలో అత్యంత బలహీనమైన ప్రధాని మోదీ మాత్రమేనని,దేశాన్ని గుజరాత్ కి దాసోహం చేశారని, ఆయనకు మరొక అవకాశం ఇస్తే ఢిల్లీని తీసుకెళ్లి గుజరాత్( Gujarat ) లో కలిపేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు .

ఢిల్లీలో ఆఫీసులు ఓపెన్ చేసినప్పటికీ తాము హైదరాబాద్ నుంచే దేశ రాజకీయాలను నడిపిస్తామని ఆయన చెప్పుకొచ్చారు ఒకప్పుడు తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు పడిన తెలంగాణ ఇప్పుడు వరి సాగులో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఇదంతా కేసిఆర్( CM KCR ) ఘనతని, ఆయన మూడవసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

"""/" / అభివృద్ధి గురించి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) లాంటి థర్డ్ గ్రేడ్ క్రిమినల్ మాట్లాడడం ఏమిటంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులకు భాజపా -కాంగ్రెస్ ఇద్దరూ బాధ్యత వహించాలన్న కేటీఆర్, దేశానికి కొత్త నాయకత్వం అవసరం అంటూ వ్యాఖ్యలు చేశారు.

బాజాపా యేతర కాంగ్రెస్ యేతర రాజకీయాలకు కట్టుబడి ఉన్నామని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు .

నాకెప్పుడూ చరణ్ సత్తా మీద డౌట్ లేదు.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు వైరల్!