కేటీఆర్ విర్రవీగి మాట్లాడుతున్నారు..: మధు యాష్కీ
TeluguStop.com
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మంత్రి కేటీఆర్ విర్రవీగి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మ్యానిఫెస్టోతో కేసీఆర్ మరోసారి ప్రజల చెవిలో పువ్వులు పెట్టారని మధు యాష్కీ విమర్శించారు.
2014, 2018 లో ఇచ్చిన హామీలనే కేసీఆర్ ఇంకా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో కొత్త హామీలు ఇవ్వడం మరోసారి ప్రజలను మోసం చేయడమేనని విమర్శలు చేశారు.
కాంగ్రెస్ గ్యారంటీలతో కేసీఆర్ కు వణుకు వచ్చిందన్నారు.మా గ్యారంటీ స్కీమ్ లకు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించిన కేటీఆర్ మీ బడ్జెట్ గురించి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
అదేవిధంగా టికెట్ల విషయంలో తమకు ఎలాంటి ఆందోళన లేదని తెలిపారు.అయితే కొన్ని సార్లు ఆశించిన వారందరికీ టికెట్లు రాకపోవచ్చన్న మధు యాష్కీ పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచించారు.