ఏపీ ఎన్నికల ఫలితాలపై మరోసారి స్పందించిన కేటీఆర్..!!

తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్( KTR ) మాట్లాడారు.ఈ సందర్భంగా ఏపీ ఎన్నికల ఫలితాలపై( AP Election Results ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే పలుమార్లు ఏపీలో వైసీపీ ( YCP ) గెలవబోతున్నట్లు కేటీఆర్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

తాజాగా పోలింగ్ అనంతరం కూడా ఆరీతిగానే వ్యాఖ్యలు చేశారు.ఏపీలో మరోసారి వైయస్ జగన్( YS Jagan ) గెలుస్తారని తమకు సమాచారం ఉందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల గురించి మాట్లాడుతూ సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ కే అనుకూలమని స్పష్టం చేశారు.

కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత క్షేత్రస్థాయిలో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.మెదక్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, కరీంనగర్, ఖమ్మంలో గెలుపు ఖాయమన్నారు.

"""/" / ఒక్క నల్గొండలో మాత్రమే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

సైలెంట్ ఓటింగ్ తమ పార్టీకే అనుకూలంగా మారిందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో మే 13న ఎన్నికలు ముగిశాయి.ఏపీలో అసెంబ్లీ.

పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జూన్ 4వ తారీఖు ఫలితాలు వెలువడనున్నాయి.ఈసారి ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఏపీలో పోలింగ్ అనంతరం పల్నాడు, అనంతపురం ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

వైసీపీ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు.ఈ క్రమంలో తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఏపీలో మరోసారి జగన్ అధికారంలోకి రాబోతున్నట్లు కేటీఆర్ కామెంట్లు చేయటం తెలుగు రాజకీయాలలో సంచలనగా మారింది.

ఆ ఫార్ములాతో టి. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక .. వీరంతా పైరవీలు