బండి సంజయ్ పై సీరియస్ కామెంట్లు చేసిన కేటీఆర్..!!
TeluguStop.com
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విషయంలోకి వెళితే ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హులైన వారు.పొందలేని పరిస్థితిలో ఉన్న వారి దగ్గర నుండి దరఖాస్తులు స్వీకరించి.
రాష్ట్ర ప్రభుత్వానికి పంపడానికి బండి సంజయ్ ఇటీవల దరఖాస్తుల ఉద్యమం.బిజెపి తరఫున కరీంనగర్ జిల్లాలో ఇటీవల ప్రారంభించడం జరిగింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఫోటో పోస్ట్ చేసి బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఈ తరుణంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో బండి సంజయ్ పెట్టిన పోస్ట్ పై స్పందించి బీజేపీ పార్టీని ఇరుకున పెట్టేలా కామెంట్ చేశారు.
"""/" /
విషయంలోకి వెళితే ప్రధాని మోడీ 2014 ఎన్నికల టైంలో.దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి 15 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుందని హామీ ఇచ్చారు.
విదేశాల్లో దాగి ఉన్న నల్లధనాన్ని వంద రోజుల్లో తీసుకొస్తాను అని స్పష్టం చేశారు.
ఆ హామీని కేటీఆర్ గుర్తు చేసి దేశంలో ప్రతి పౌరుడికి 15 లక్షలు మోడీ ఇవ్వడానికి కూడా దరఖాస్తులను రాష్ట్ర బీజేపీ శాఖ తీసుకోవాలని చర్య ప్రారంభించాలని.
అన్నట్టుగా కేటీఆర్ బండి సంజయ్ కి కామెంట్ల ద్వారా చురకలంటించారు.రాష్ట్రంలో అర్హులైన ప్రతి పౌరుడికి జన్ ధన్ ఖాతా లో.
ధనాధన్ డబ్బులు పడేందుకు బిజెపి నాయకులు దరఖాస్తులు పంపాలని కేటీఆర్ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.
పుష్ప 2 టార్గెట్ ను రీచ్ అవుతుందా..?