సీసీఐ ను తెరలవాలంటూ కేంద్రానికి కేటీఆర్ లేఖ.. స్పందించేనా?
TeluguStop.com
తెలంగాణ రాజకీయాలు మొత్తం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది.
అయితే కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం జరుగుతున్న పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా, లేఖల ద్వారా మంత్రి కేటీఆర్ త్వరిత గతిన స్పందిస్తూ రాష్ట్రానికి అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది.
ఇటీవల చేనేత ఉత్పత్తులపై 5 శాతం ఉన్న జీఎస్టీ 12 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో కేంద్రం దిగి వచ్చిన పరిస్థితి ఉంది.
తాజాగా అదిలాబాద్ జిల్లాలో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీని తిరిగి ప్రారంభించాలని దీంతో వేలాది మందికి ఉపాధిని కల్పిస్తుందని రాష్ట్రం పరంగా ఎటువంటి సపోర్ట్ చేయడానికైనా సిద్దంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
దేశంలోని సిమెంట్ కంపెనీలు భారీగా లాభాలను గడిస్తున్నాయని,తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సిమెంట్ కు భారీ డిమాండ్ ఉందని, కంపెనీని ప్రారంభిస్తామంటే ప్రస్తుతం ఏదైతే కొత్త కంపెనీలకు ప్రోత్సాహకాలిస్తున్నామో అవే ప్రోత్సాహకాలిస్తామని, వెసులుబాటు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ తన లేఖలో తెలిపారు.
"""/"/ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు, ఉపాధి పెరుగుదలపైనే పెద్ద ఎత్తున దృష్టి సారించిందని, ప్రభుత్వం కృషి వల్లే ఆదిలాబాద్ దేవాపూర్ యూనిట్ లో ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిందని లేఖలో మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
ఇప్పటికే ఈ విషయంపై చాలా సార్లు గుర్తు చేశామని, ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
మరి సీసీఐ కంపెనీపై మంత్రి కేటీఆర్ విజ్ఞప్తిని కేంద్రం పరిశీలిస్తుందా, సానుకూలంగా స్పందిస్తుందా అనేది చూడాల్సి ఉంది.
ఒకవేళ కేంద్రం సానుకూలంగా స్పందిస్తే ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది.
దేవుడా, చేప నోట్లో మనిషి పళ్లు.. చూసి పరుగులు తీసిన యువతి!