టీఆర్ఎస్ లో లుకలుకలు .. రంగంలోకి కేటీఆర్ ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో పరిస్థితి అంతా బాగానే ఉన్నట్టు గా పైకి కనిపిస్తున్నా,  లోపల మాత్రం పార్టీ కార్యకర్తల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి ఆగ్రహజ్వాలలు ఉన్నట్లుగా ఇప్పుడిప్పుడే బయట పడుతోంది.

ముఖ్యంగా పార్టీ నాయకులు ఎవరు కార్యకర్తలను పెద్ద పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తుండడంతో,  వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.

అధికార పార్టీ లో ఉన్నా, తమ పనులు చక్క బెట్టుకు లేక పోతున్నామని , నాయకులు ఎవరు తమను పట్టించుకోవడం లేదనే అసంతృప్తిలో ఉన్నట్లు గా టిఆర్ఎస్ అధిష్టానానికి ఫీడ్ బ్యాక్ అందింది.

పరిస్థితి ఈ విధంగా ఉంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సొంత పార్టీ కార్యకర్తల నుంచి సరైన సహకారం అందదు అనే అభిప్రాయానికి వచ్చిన టిఆర్ఎస్ అధిష్టానం హడావుడిగా ఈ పరిస్థితిని మార్చేందుకు రంగంలోకి దిగింది.

ఒక వైపు సమావేశాలు ఏర్పాటు చేస్తూనే , మరో వైపు విజయ్ గర్జన సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

  అలాగే సభలు సమావేశాలు నిర్వహిస్తూ మండలస్థాయి నేతలతోనూ మాట్లాడే విధంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

నేరుగా కార్యకర్తలతో మాట్లాడుతూ,  వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ వారిలో అసంతృప్తి కి గల కారణాలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కేటీఆర్ కృషి చేస్తున్నారు.

తెలంగాణలో టిఆర్ఎస్ కు దాదాపు 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు.అయినా  గ్రామ స్థాయిలో కార్యకర్తలు,  నాయకుల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంది.

  ప్రజాప్రతినిధులు కార్యకర్తలను పెద్దగా పట్టించుకోకపోవడంతో అనేక సందర్భాల్లో కార్యకర్తలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.

ఈ వ్యవహారాల కారణంగా పార్టీ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉండడంతో , కేసీఆర్ కేటీఆర్ ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.

  పార్టీ స్థాపించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ లో వచ్చే నెల 15వ తేదీన విజయ్ గర్జన సభను నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

దీనికోసం ఈ నెల 18 నుంచి 20 నియోజకవర్గాలకు చెందిన కీలక ప్రజాప్రతినిధులతో పాటు నాలుగు వందల మంది పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులతో కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఒక్కో నియోజకవర్గానికి ప్రత్యేకంగా సమయం కేటాయించి , ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు,  నేతల అసంతృప్తి,  గ్రూపు రాజకీయాలు ఇలా అన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకుంటూ, వాటి పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు.

అయితే ఈ సందర్భంగా కార్యకర్తలు మండల స్థాయి నాయకుల నుంచి కొన్ని అభ్యర్థనలు పార్టీ అధిష్టానానికి వచ్చాయి.

  """/"/  ప్రభుత్వ పథకాల సొమ్ము నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వేయకుండా,  మండల స్థాయి నాయకులతో వాటిని ఇప్పించేలా చూడాలని,  అప్పుడే తనకు సరైన గుర్తింపు వస్తుందని, సూచించినట్లు తెలుస్తోంది.

కేవలం ఎమ్మెల్యేలు, కీలక నాయకులతోనే కాకుండా,  తమ ద్వారా కూడా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని కార్యకర్తలు కోరుతున్నారట .

అప్పుడే టిఆర్ఎస్ కార్యకర్తలుగా తమకు ప్రాధాన్యం ఉంటుందని సూచించినట్లు సమాచారం.ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికల విషయంపై టిఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టింది.

ఈ ఎన్నికల ఫలితాల అనంతరం పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించి ఎక్కడా ఎవరికీ ఎటువంటి అసంతృప్తి తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాలు రచిస్తున్నారట.

షాంపూ జుట్టుకే కాదు ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా?