కెటీఆర్-జేపీ నడ్డా వ్యాఖ్యల వార్..ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉంది.ప్రస్తుతం బీజేపీ టీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

బండి సంజయ్ అరెస్ట్ తరువాత బీజేపీ ఉవ్వెత్తున ఎగసిపడ్డ విషయం తెలిసిందే.కాళేశ్వరం ప్రాజెక్ట్ కెసీఆర్ కు ఏటీఎం గా మారిందని కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని జెపీ నడ్డా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా జెపీ నడ్డా వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

కెసీఆర్ ఏటీఎం మాత్రమేనని అన్నదాతలకు తోడుండే మిషిన్ అని అన్నదాతలకు అండగా ఉండే ఏకైక ప్రభుత్వం ఒక కెసీఆర్ ప్రభుత్వమేనని, అన్నదాతలను అడిగితే కెసీఆర్ గురించి చెబుతారని బీజేపీ విమర్శలకు ప్రతి విమర్శ ఘాటుగానే ఉంటుందని బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని మా వెంట తెలంగాణ ప్రజలు ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అయితే జెపీ నడ్డా వ్యాఖ్యలపై కెసీఆర్ స్పందిస్తారని భావించినా కెసీఆర్ జెపీ నడ్డా వ్యాఖ్యలను అంతగా సీరియస్ గా తీసుకోనట్లు తెలుస్తోంది.

అందుకే కేవలం కేటీఆర్ మాత్రమే స్పందించి జెపీ నడ్డాను తాను చేసిన వ్యాఖ్యలతోనే ఇరుకునపెట్టిన పరిస్థితి ఉంది.

"""/"/ దీంతో సోషల్ మీడియాలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్ గా మారాయి.

అయితే బండి సంజయ్ అరెస్ట్ తో పెద్ద ఎత్తున హైప్ వస్తుందని భావించినా అంతగా ప్రజల నుండి స్పందన రాలేదు, ఉపాధ్యాయుల నుండి కూడా సరైన మద్దతు బండి సంజయ్ కు దొరకనటువంటి పరిస్థితి ఉంది.

దీంతో జన జాగరణ దీక్ష నిర్వహించి ఇరుకున పడ్డామనే భావనను మెజారిటీ బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా రానున్న రోజుల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయం రణరంగంగా మారే అవకాశం ఉంది.

నేడు జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల ఫలితాలు