రేపు మునుగోడుకు కేటీఆర్!

నల్లగొండ జిల్లా:మునుగోడు:టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ రాష్ట్ర మంత్రులు జ‌గ‌దీశ్ రెడ్డి, వేముల ప్ర‌శాంత్ రెడ్డి,ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు,స‌త్య‌వ‌తి రాథోడ్‌ లతో కలిసి రేపు గురువారం మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో పర్యటించనున్నారు.

మునుగోడు ప‌ట్ట‌ణంలోని ధ‌న‌ల‌క్ష్మి ఫంక్ష‌న్ హాల్లో జ‌రిగే స‌మావేశంలో పాల్గొని,ఉప ఎన్నిక‌ సందర్భంగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమ‌లుపై మంత్రి కేటీఆర్ స‌మీక్షించ‌నున్నారు.

ఈ స‌మావేశానికి స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు పార్టీ నాయ‌కులు హాజ‌రు కానున్నారు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు సమీక్షా సమావేశం జ‌ర‌గ‌నుందని తెలుస్తోంది.

మునుగోడుకు ఇటీవ‌ల జ‌రిగిన ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి గెలుపొందిన విష‌యం విదిత‌మే.