ఇప్పుడు 'ఢిల్లీ రాజకీయం ' కేటీఆర్ వంతు ?

నిన్నా మొన్నా మొన్నటి వరకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.

త్వరలో ఏర్పాటు చేయబోతున్న జాతీయ పార్టీ గురించి , వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలను,  వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ కేసీఆర్ చర్చలు నిర్వహిస్తూ, హడావుడి చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు కేసీఆర్ తనయుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీ బాట పట్టారు.

కొద్దిరోజులుగా బిజెపిని టార్గెట్ చేసుకుంటూ కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు.దమ్ముంటే తనపై కేసులు పెట్టాలని సవాళ్లు విసురుతున్నారు.

తెలంగాణ విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని, నిధులు అనుమతులు విషయంలో పక్షపాతం చూపిస్తోందని కేటీఆర్ విమర్శలు చేయడమే కాకుండా,  లేఖలతో నూ విమర్శలు సంధిస్తున్నారు.

  అంతేకాకుండా ఢిల్లీ కి వెళ్ళు కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీ అవుతున్నారు.ఇటీవల రాజీవ్ చంద్రశేఖర్ తో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఆ తరువాత వరుసగా తెలంగాణలోని జిల్లాల్లో పర్యటించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించడం లేదంటూ ఫైర్ అయ్యారు.

నిధుల కోసమే ఢిల్లీ వెళ్తున్నట్లు గా ఆయన చెబుతున్నారు.ప్రస్తుతం కేటీఆర్ ఢిల్లీ టూర్ లో కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరి దీప్ సింగ్ పూరి తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

"""/"/ హైదరాబాద్ మురుగు నీటి పారుదల ప్లాన్, రోడ్ల కు ఆర్థిక సహాయం చేయాలని ఆయన కోరారు .

అయితే ఎన్నిసార్లు అడిగినా, కేంద్రం నిధులు ఇవ్వడం లేదని కేటీఆర్ చెబుతూనే పదేపదే ఢిల్లీ వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది.

ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలు విషయం కోసమే ఢిల్లీ వెళ్తున్నట్లు కేటీఆర్ చెబుతున్న జాతీయ రాజకీయాలపై ఒక అంచనాకు రావడం తో పాటు,  త్వరలో ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీకి సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టెందుకు కేటీఆర్ ఢిల్లీ బాట పడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వైరల్ వీడియో: అట్లుంటది మరి మనతోని.. ఉచిత బస్సును మాములుగా వాడట్లేదుగా..