చంద్రబాబు ఆశలపై నీళ్లు చిమ్మేస్తున్న కేసీఆర్, కేటీఆర్ ! 

టిడిపి అధినేత చంద్రబాబు ఊరకనే ఎవరిని పొగడరు.అలా పొగడారు అంటే ఏదో ఒక రాజకీయ ప్రయోజనం ఉండే తీరుతుంది.

ఇది అనేక సందర్భాల్లో రుజువు అయింది.బీఆర్ఎస్ ప్రభుత్వం పైన , కెసిఆర్ పరిపాలన పైన చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

బీఆర్ఎస్ తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తెలంగాణలో ఇటీవల కాలంలో టిడిపి ( TDP )యాక్టివ్ అయింది.

అంతేకాకుండా ఒక ప్రధాన సామాజిక వర్గం ఓటు బ్యాంకు టిడిపికి ఉంది.దానిని తెరపైకి తెచ్చి బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లోనూ యాక్టివ్ అవ్వాలని బాబు చూస్తున్నారు.

"""/" /  వాస్తవంగా 2018 ఎన్నికలకు ముందు కూడా బీఆర్ఎస్( BRS Party ) తో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేశారు .

ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ మృతి చెందిన సందర్భంగా సంతాపం ప్రకటించడానికి వెళ్లిన కేటీఆర్ తో చంద్రబాబు పొత్తుల అంశంపై మాట్లాడారనే విషయాన్ని స్వయంగా కేటీఆర్ ప్రకటించారు .

"""/" /  చంద్రబాబు( Chandrababu Naidu ) వ్యూహాలు బాగా తెలిసిన కెసిఆర్, కేటీఆర్ లు వీలైనంత దూరంగానే ఉంటూ వస్తున్నారు .

అంతేకాకుండా 2018 ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ ను ఓడించేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని, కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి బీ ఆర్ ఎస్  ఓటమికి కృషి చేశారని, కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అప్పట్లోనే కెసిఆర్ ప్రకటించారు.

దీనికి తగ్గట్లుగానే 2019 ఎన్నికల్లో వైసీపీకి సహకారం అందించి ఆ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కేసీఆర్ కృషి చేశారు.

ఈ విషయాన్ని బీఆర్ఎస్ అగ్ర నేతలు ఎవరు మర్చిపోలేదు.అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబు మళ్ళీ కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు.

కేసీఆర్ పరిపాలన బాగుందని పొగిడే ప్రయత్నం చేస్తూ, పొత్తు పెట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్, కేటీఆర్ లు గత కొద్ది రోజులుగా చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్ ను నేనే కట్టాను అన్న చంద్రబాబు వ్యాఖ్యలను వ్యంగంగా ప్రస్తవిస్తూ కేటీఆర్ సెటైర్లు వేశారు.

ఎన్నో విమర్శలు చేశారు.ఆయన 9 ఏళ్ల పాలనలో తెలంగాణ ఎన్నో కష్టాలు ఎదుర్కొందని విమర్శించారు.

ఒకవైపు చంద్రబాబు  పొత్తు ప్రయత్నాల్లో ఉండగానే కెసిఆర్, కేటీఆర్ లు ఈ విధంగా సెటైర్లు వేస్తూ పొత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు ఇష్టం లేదనే సంకేతాలను పంపిస్తున్నారు.

ఓరి దేవుడా . . వీరికి ఇదేం పోయేకాలం.. నడిరోడ్డుపై అలా..