‘బస్సుల్లో డ్యాన్సులు ‘ స్పందించిన కేటీఆర్ 

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

'' బస్సుల్లో అల్లం , వెల్లుల్లి,  కుట్లు,  అల్లికలు చేసుకుంటే తప్పేంటి అన్న మంత్రి సీతక్క( Minister Seethakka ) వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ బస్సుల్లో కుట్లు,  అల్లికలు మేం వద్దనట్లేదు.

  అవసరమైతే బ్రేక్ డ్యాన్స్  వేసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు.బస్సుల్లో సీట్ల కోసం తన్నుకుంటున్నారు.

ఆర్టీసీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నాం '' అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడం, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటాగా తీసుకుని మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతర వ్యాఖ్యలు చేసినట్లుగా మహిళా కమిషన్ అభిప్రాయబడింది.

"""/" / తెలంగాణ మహిళలను కించపరిచేలా కేటీఆర్ వ్యాఖ్యలు కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ళ శారద సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

తాజాగా ఈ వ్యవహారంపై కేటీఆర్ సైతం సోషల్ మీడియాలో స్పందించారు." పార్టీ సమావేశంలో యాథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళ సోదరీమణులకు మనస్థాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను.

నా అక్కాచెల్లెళ్లను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు ' అంటూ కేటీఆర్ స్పందించారు.

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం( Women Free Bus Facility ) కల్పించిన దగ్గర నుంచి బీఆర్ఎస్ అనేక సందర్భాల్లో ఈ వ్యవహారాలపై స్పందించింది.

"""/" / ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ కోలుకోలేని దెబ్బ తిటుంది అని, ఆర్టీసీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని,  అలాగే  బస్సుల సంఖ్య పెంచాలని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం పై కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారి కేటీఆర్ కూ, బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయి.

కేటీఆర్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసుకోవడంతో కేటీఆర్ పై విధంగా స్పందించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైలాగ్ డెలివరీలో టాప్ హీరో అతనే.. వాళ్లు సైతం అంగీకరించారుగా!