సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారు స్పష్టం చేసిన కేటీఆర్..!!
TeluguStop.com
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గత వారం రోజులగా వైరల్ ఫీవర్ మరియు దగ్గుతో బాధపడుతున్నారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్( Minister KTR ) మంగళవారం సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి( CM KCR ) ఇంటి వద్దనే వైద్యులు చికిత్స అందిస్తున్నారని.
పేర్కొన్నారు.వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంది.
కొద్దిరోజుల్లోనే ఆయన కోలుకొని సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు తెలియజేసినట్లు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది.
ఇదిలా ఉంటే త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.దీంతో మంత్రి కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా తీరుగుతూ పార్టీ నాయకులను అన్ని రకాలుగా సిద్ధపరుస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు జరిగిన ఎన్నికలలో కేసీఆర్ పార్టీ విజయం సాధించింది.
ఇప్పుడు జరగబోయే మూడో సారీ ఎన్నికలలో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్( BRS ) అన్ని రకాలుగా రెడీ అవుతూ ఉంది.
ఈ క్రమంలో జరగబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది.
ఇక ఇదే సమయంలో ఈసారి కేసీఆర్ పార్టీని ఓడించాలని జాతీయ పార్టీలు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ కూడా భారీగానే కష్టపడుతున్నాయి.
వీడియో: యూపీ పోలీసు అరాచకం.. పోలీస్ స్టేషన్‌లోనే యువకుడిని బెల్టుతో చితకబాదిన వైనం..