కాంగ్రెస్ కి డెడ్ లైన్ ప్రకటించేసిన కేటీఆర్!

అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన బాధ బిఆర్ఎస్( BRS ) నాయకుల కి ఎంత ఉందో తెలియదు గానీ తిరిగి గోడకు కొట్టిన బంతిలా తిరిగి పుంజుకుంటామన్న ధీమా మాత్రం ఆ పార్టీ ప్రదాన నాయకుల్లో బలంగానే కనిపిస్తుంది.

ముఖ్యంగా అసెంబ్లీ లో బారి సంఖ్య లో ఉన్న అధికార పక్ష నాయకులను ఒంటిచేతి తో ఎదుర్కుంటున్న కేటీఆర్( KTR ) ధైర్యం చూస్తే, కేసీఆర్ ప్రక్కన లేకపోయినా భారతీయ రాష్ట్ర సమితిని కేటీఆర్ అంతే బలం గా ముందుకు నడిపించే నాయకుడుగా ఆ పార్టీ శ్రేణుల తో పాటు ఆ పార్టీ సానుభూతి పరులకు కనిపిస్తున్నారంటే అతిశయోక్తి కాదని చెప్పవచ్చు.

ముఖ్యంగా అధికార పక్షం నుంచి ముఖ్య మంత్రి తో సహా మిగిలిన నాయకులు చేస్తున్న విమర్శలకు అంతే దీటుగా సమాధానం చెప్తున్న కేటీఆర్ అధికార పక్షం చేస్తున్న ప్రతి విమర్శకు అంకెలతో సహా లెక్కలు చెప్తూ ఉండడం గమనార్హం.

ముఖ్యంగా తనని ఎన్నారై అని, మేనేజ్మెంట్ కోటాలో సీటు దక్కించుకున్నారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్( CM Revanth Reddy ) చేస్తున్న వ్యాఖ్యలకు స్పందించిన కేటీఆర్ అసలు ఎన్నారైలకు సీట్లు అమ్ముకున్నదే రేవంత్ అని, పార్టీ అధ్యక్షురాలిను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న చరిత్ర కాంగ్రెస్ ది అంటూ సూపర్ కౌంటర్ ఇచ్చారు.

"""/" / బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను మొత్తం లూటీ చేసిందని, అన్ని రంగాలను అప్పుల పాలు చేసిందని వస్తున్న విమర్శలను కూడా తిప్పికొడ్తున్న కేటీఆర్ అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువ అని, తాము చేసిన అప్పలే కాదు చేసిన అభివృద్ధి కూడా చూడాలంటూ అంశాల వారీగా తమ ప్రభుత్వ అభివృద్ధిని వివరించిన కేటీఆర్ , తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో వచ్చిన గణనీయమైన ప్రగతిని అసెంబ్లీ వేదిక ప్రజలకు వివరించడం గమనార్హం.

"""/" / అంతేకాకుండా ఆరు హామీలను ఇచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్( Congress Party ) వంద రోజుల డెడ్ లైన్ లోపు వాటిని అందుకోవాలని కే టి ఆర్ సవాల్ విసిరారు.

లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజల్లో ఎండగడతామంటూ ఆయన హెచ్చరించారు .

ఏది ఏమైనా ప్రతిపక్ష పార్టీ లో ఉన్నా కూడా వన్ మాన్ ఆర్మీలా వ్యవహరిస్తున్న కేటీఆర్ మిగిలిన బిఆర్ఎస్ నాయకులలో ఆత్మస్థైర్యం నిండే విధంగా పనిచేస్తున్నారని చెప్పవచ్చు .

హాస్య చక్రవర్తికి జేజేలు… 50 ఏళ్లపాటు నవ్వులు పూయించిన మహానుబావుడు!