మెగాస్టార్ సినిమా ఫ్లాప్ కావడంతో ఆ నిర్మాతలో కసి పెరిగిందట.. ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి.సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న చిరంజీవితో సినిమాలు తీయడానికి నిర్మాతలు సైతం ఎంతో ఆసక్తి చూపిస్తారు.

చిరంజీవితో తెరకెక్కించిన సినిమాల ద్వారా ఎంతోమంది ప్రొడ్యూసర్లు స్టార్ ప్రొడ్యూసర్లుగా ఎదిగారు.చిరంజీవితో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలను నిర్మించారు.

అయితే చిరంజీవి హీరోగా కేఎస్ రామారావు నిర్మాతగా తెరకెక్కిన స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది.

ఈ సినిమా ఫ్లాప్ కావడం గురించి కేఎస్ రామారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

తన బ్యానర్ లో వరుసగా సక్సెస్ లు సొంతం చేసుకుంటున్న తరుణంలో స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ మూవీ ఫ్లాప్ గా నిలిచిందని ఆయన అన్నారు.

ఆ సినిమా వల్ల తనకు తొలిసారి ఫ్లాప్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో అర్థమైందని కేఎస్ రామారావు అన్నారు.

"""/"/యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా ఆ సినిమాను తెరకెక్కించామని తన లైఫ్ లో ఆ సినిమా పెద్ద కుదుపు అని ఆయన అన్నారు.

స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ ఫ్లాప్ అయిన తర్వాత తన జడ్జిమెంట్ ఎలా తప్పిందని ఆలోచించానని కేఎస్ రామారావు వెల్లడించారు.

ఫ్లాప్ మూవీ తీశాననే అహం నాకు కలిగిందని కేఎస్ రామారావు అన్నారు. """/"/ ఆ తర్వాత కసితో సినిమాను నిర్మించి సక్సెస్ సాధించిందని కేఎస్ రామారావు వెల్లడించారు.

కేఎస్ రామారావు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ మధ్య కాలంలో కేఎస్ రామారావు సినిమాల నిర్మాణాన్ని తగ్గించిన విషయం తెలిసిందే.

పరిమితంగా కేఎస్ రామారావు సినిమాలు నిర్మిస్తున్నా ఆ సినిమాలు సక్సెస్ సాధించడం లేదు.

హరిహర వీరమల్లు కు తప్పని కష్టాలు…ఈ సినిమా చేయడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదా..?