తెలుగులో ఫ్లాప్ హీరోయిన్.. తమిళ్ లో స్టార్ హీరోయిన్.. కృతిశెట్టికి అలా కలిసొస్తోందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతిశెట్టికి ఉన్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువేననే సంగతి తెలిసిందే.

అయితే వరుస ఫ్లాపుల వల్ల కృతిశెట్టి( Krithi Shetty )కి ఆఫర్లు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు ఒకింత టెన్షన్ పడుతున్నారు.

ప్రస్తుతం ఈ బ్యూటీ శర్వానంద్ తో కలిసి మనమే అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా జూన్ నెల 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. """/" / కృతిశెట్టికి తెలుగులో ఆఫర్లు తగ్గుతున్నా తమిళంలో మాత్రం ఈ బ్యూటీ ఊహించని స్థాయిలో బిజీ అవుతున్నారు.

చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కృతిశెట్టికి ప్లస్ అయింది.తమిళంలో జయం రవికి జోడీగా జెనీ, ప్రదీప్ రంగనాథన్ కు జోడీగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, కార్తీకి( Karthi ) జోడీగా ఒక సినిమాలో నటిస్తున్నారు.

ఈ మూడు సినిమాలలో కనీసం రెండు సినిమాలు హిట్టైనా కృతిశెట్టికి తిరుగుండదని చెప్పవచ్చు.

"""/" / మనమే మూవీ( Manamey ) సక్సెస్ సాధిస్తే తెలుగులో కూడా కృతిశెట్టికి తిరుగుండదని చెప్పవచ్చు.

కృతిశెట్టి కొన్ని సినిమాలలో గ్లామరస్ గా కనిపించినా హద్దులు మీరి మాత్రం గ్లామర్ షో చేయడం లేదు.

రెమ్యునరేషన్ విషయంలో సైతం కృతిశెట్టి ఎక్కువ డిమాండ్లు చేయడం లేదని సమాచారం అందుతోంది.

కృతిశెట్టి క్రేజ్ ను మరింత పెంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.కృతిశెట్టి కాంబినేషన్ల కంటే మంచి కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

కృతిశెట్టి వరుస విజయాలు సాధిస్తే ఆమెకు పూర్వ వైభవం రావడం కష్టం అయితే కాదని చెప్పవచ్చు.

టాప్ హీరోయిన్ గా ఎదగాలంటే మరింత కష్టపడాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు.

టాలీవుడ్ టైర్1 హీరోలకు జోడీగా నటించే ఛాన్స్ వస్తే కృతిశెట్టి కెరీర్ కు మరింత బెనిఫిట్ కలుగుతుంది.

క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారిని ఆడించిన అడివి శేష్.. ఈ హీరో గ్రేట్ అంటూ?