రెమ్యునరేషన్ పెంచుతున్న బేబమ్మ బొక్కబోర్లా పడుతుందా?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు అధిక రెమ్యూనరేషన్ చెల్లించి హీరోయిన్లకు కొద్దిపాటి రెమ్యూనరేషన్ తో సరి పెట్టేవారు నిర్మాతలు.

కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది.ఆ హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చింది ఎంత మంది హీరోలతో నటించింది అన్న విషయాన్ని పక్కన పెట్టి తనకు ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని వారికి రెమ్యునరేషన్ ఇస్తున్నారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు పొందారు.

ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఒకరని చెప్పవచ్చు.

బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ తేజ్ సరసన నటించిన ఈమె మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఆఫర్లు వెల్లువెత్తాయి.

ఇలా తను నటించిన మొదటి సినిమాకు ఆరు లక్షల పారితోషికం తీసుకున్న కృతి శెట్టి నాని సినిమాకు ఏకంగా 20 లక్షలకు పెంచేసింది.

ఇకనాగార్జున నాగచైతన్య నటిస్తున్నటువంటి బంగార్రాజు చిత్రంలో ఈమె ఏకంగా రెండు కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

"""/"/ ఇలా అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినప్పటికీ ఈమెకు అవకాశాలు వస్తున్నాయి.

ఏది ఏమైనప్పటికీ ప్రతి మూడు నెలలకు ఒకసారి కృతి శెట్టి తన రెమ్యూనరేషన్ పెంచడంతో కొందరు నిర్మాతలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన మరికొందరు ఈమె పద్ధతి పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా రెమ్యూనరేషన్ విషయంలో బెట్టు చేసే కృతి శెట్టి ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగుతుందా లేక ఇండస్ట్రీలో కోలుకోలేని దెబ్బ తింటుందా అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య ఎన్టీయార్ కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్ సినిమా ఏంటో తెలుసా..?