ఏంటి లిప్ లాక్ కూడా సెంటిమెంటా..?

ఉప్పెన ఒక్క సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి తన వరుస సినిమాలతో సత్తా చాటుతుంది.

ఇక శుక్రవారం నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాతో అమ్మడు తన సెకండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సినిమాలో కృతి శెట్టి నానితో లిప్ లాక్ కూడా కానిచ్చింది.అయితే ఈ లిప్ లాక్స్ గురించి అడిగితే అమ్మడు కామెడీ ఆన్సర్ ఇచ్చింది.

సినిమాలో తను లిప్ లాక్ పెడితే సినిమా హిట్ అవుతుందని అంటుంది.ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ తో కూడా లిప్ లాక్ ఇచ్చిన కృతి శెట్టి అదే సెంటిమెంట్ తో నాని సినిమాకు కూడా లిప్ లాక్ సెంటిమెంట్ అవుతుందని భావిస్తుంది.

శ్యామ్ సింగరాయ్ సినిమాలో కీర్తి పాత్రలో నటిస్తుంది కృతి శెట్టి.వాసు పాత్రని ప్రేమించే పాత్రగా ఇది ఉంటుంది.

అయితే సినిమాలో ఆ పాత్రకి లిప్ లాక్ అవసరం కాబట్టే డైరక్టర్ చెప్పిన దానికి తాను సరే అన్నాను అంటుంది కృతి శెట్టి.

అమ్మడు చేస్తున్న సినిమాల్లో ఇదే సెంటిమెంట్ తో ప్రతి హీరోతో లిప్ లాక్ ఉంటే మాత్రం కుర్రాళ్లకి పండుగ అన్నట్టే.

కృతి శెట్టి ఈ లిప్ లాక్ సెంటిమెంట్ ఎన్ని సినిమాలకు కొనసాగిస్తుందో చూడాలి.

శ్యామ్ సింగరాయ్ రిలీజైతే ఇంకా కృతి శెట్టివి నాలుగు సినిమాలు సెట్స్ మీద ఉన్నట్టు లెక్క.

సిక్కు ఎన్జీవో సంస్ధ పెద్ద మనసు .. అమెరికా వ్యాప్తంగా ఏకంగా 10 వేల మందికి భోజనం