ఆసిన్, అనుపమ దారిలోనే వెళ్తున్న కృతి శెట్టి

కృతి శెట్టి.టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు.తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

డ్రీమ్ డెబ్యూగా ఉప్పెన సినిమా నిలిచింది.ఈ సినిమా సక్సెస్ తర్వాత కృతి శెట్టికి వరుస అవకాశాలు వచ్చాయి.

రెండు సినిమాగా శ్యామ్ సింగ రాయ్ చేసింది.ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంది.

ఆ సినిమా తర్వాత మరో సినిమాలో అవకాశాన్ని అందుకుంది.అది మరేదో కాదు.

బంగార్రాజు.ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది.

నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో నాగ చైతన్య కు జంటగా నటిస్తోంది.

ఈ సినిమాలో కృతి శెట్టి సర్పంచ్ నాగ లక్ష్మిగా కనిపిస్తుంది.తాజాగా ఈ సినిమా జనాలను అలరిస్తోంది.

అటు ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన తొలి ఏడాదిలోనే హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు.

సంక్రాంతి బరిలో నిలిచి మూడో విజయాన్ని అందుకున్నారు.వారే అసిన్, అనుపమ పరమేశ్వర్.

2003లో అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత నాగార్జునతో కలిసి శివమణి సినిమా చేసి మరో విజయాన్ని అందుకుంది.

అనంతరం 2004లో సంక్రాంతికి వచ్చిన లక్ష్మీ నరసింహతో హ్యాట్రిక్ అందుకుంది. """/"/ అటు అనుపమ పరమేశ్వర్ సైతం అ ఆ సినిమాతో 2016లో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

2016లో రెండు వరుస విజయాలు అందుకుంది.2017 సంక్రాంతికి వచ్చిన శతమానం భవితి సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది.

"""/"/ టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న అసిన్, అనుపమ పరమేశ్వర్ బాటలోనే కృతి శెట్టి కూడా నడుస్తుందేమో చూడాలి.

తాజాగా విడుదల కానున్న బంగార్రాజు హిట్ కొడితే వారి సరసన కృతి శెట్టి చేరనుంది.

హ్యాట్రిక్ కొట్టిన మూడో హీరోయిన్ గా నిలువనుంది.

Mahesh Babu : మహేష్ బాబు తో రొమాన్స్ చేయనున్న స్టార్ హీరోయిన్…