మరో సారి యూట్యూబ్‌ ను షేక్‌ చేసేందుకు రాబోతున్న ఉప్పెన బ్యూటీ

ఏ హీరోయిన్ కి కూడా మొదటి సినిమా తో రాని గుర్తింపు ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి కి దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఉప్పెన సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడు ఏకంగా మూడు సినిమా లకు సైన్ చేసింది అంటే అమ్మడు క్రేజ్ ఏ స్థాయి లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఉప్పెన సినిమా విడుదలై దాదాపుగా 100 కోట్లు వసూళ్లు నమోదు చేసిన నేపథ్యం లో అమ్మడుకి అవకాశాలు వెల్లువెత్తాయి.

ప్రస్తుతం కృతి శెట్టి చేతి లో అరడజను సినిమా లకు పైగా ఉన్నాయి.

ఇటీవలే శ్యామ్‌ సింగ రాయ్ మరియు బంగార్రాజు సినిమా లతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

అతి త్వరలోనే మరో రెండు సినిమా లను కూడా ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుంది.

"""/"/ అందులో ఒకటి సుధీర్ బాబు హీరో గా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.

ఈ సినిమా లో ఉప్పెన బేబమ్మ లుక్ లో కృతి శెట్టి కనిపించబోతుంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మరియు గ్లిమ్స్‌ చూస్తుంటే ఖచ్చితంగా ఉప్పెన బేబమ్మ ను మనం మళ్లీ చూడబోతున్నాము అనిపిస్తుంది అంటూ మీడియా వర్గాల వారు మరియు నెటిజన్స్‌ సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాకు సంబంధించిన పాటను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

కొత్త కొత్తగా అంటూ సాగే ఈ పాటను ఫిబ్రవరి 7వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

సుధీర్ బాబు తో కృతి శెట్టి రొమాన్స్ కచ్చితంగా పీక్ స్టేజ్ లో ఉంటుందని తప్పకుండా మరో సారి కృతి శెట్టి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతుంది అంటూ సినీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

కృతి శెట్టి లుక్‌ మరియు లక్‌ బాగుంది కనుక కచ్చితంగా ఆమెతో సుధీర్ బాబు చేసిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ నెటిజన్స్ మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కృతి శెట్టి మరో వైపు రామ్‌ తో కలిసి ఒక సినిమా లో నటిస్తుంది.

ఇంకా మరి కొన్ని సినిమాలు ఈమె చేస్తున్నవి షూటింగ్‌ దశలో ఉన్నాయి.

రామ్ చరణ్ శంకర్ కి దొరికిన గొప్ప నిధి… రాజీవ్ కనకాల కామెంట్స్ వైరల్!