నితిన్ కి జోడీగా కృతి శెట్టి... కొత్త దర్శకుడు చిత్రంలో

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన అందాల భామ కృతి శెట్టి.

ఈ అమ్మడు మొదటి సినిమా రిలీజ్ కాకుండానే నానికి జోడీగా శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

ఉప్పెన రిలీజ్ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ కి జోడీగా మరో సినిమాని సైన్ చేసింది.

ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ని కృతి శెట్టి సొంతం చేసుకుందని తెలుస్తుంది.

యూత్ స్టార్ నితిన్ హీరోగా తెరకెక్కబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ కోసం కృతి శెట్టిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

కొత్త దర్శకుడు శేఖర్ దర్శకత్వంలో నితిన్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉంది.ఇందులో హీరోయిన్ గా అమ్మడుకి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించినట్లు తెలుస్తుంది.

దీంతో పాటు కింగ్ నాగార్జున ఫేవరేట్ ప్రాజెక్ట్ బంగార్రాజు మూవీలో నాగ చైతన్యకి జోడీగా కృతి శెట్టిని ఖరారు చేసినట్లు సమాచారం.

త్వరలో ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.మొత్తానికి ఒక్క సినిమా ఎఫెక్ట్ తో ఇప్పుడు కృతి శెట్టి స్టార్ హీరోయిన్ చైర్ లోకి చాలా వేగంగా దూసుకొచ్చేస్తుందని చెప్పాలి.

ఇప్పటికే రష్మిక మందన, పూజా హెగ్డే స్టార్ హీరోయిన్స్ గా టాప్ చైర్ లో కొనసాగుతున్నారు.

అయితే వారి దృష్టి అంతా బాలీవుడ్ వైపు ఉంది.ఈ నేపధ్యంలో యంగ్ హీరోలకి మెయిన్ ఛాయస్ గా ఇప్పుడు కృతి శెట్టి మారిపోయే అవకాశం ఉంది.

చనిపోయిన కోళ్ల నుంచి ఎగిసిపడుతున్న మంటలు.. వీడియో చూసి నెటిజన్లు షాక్..