కృతి శెట్టి పాత్ర హైలెట్ గా ఆ సినిమా..!

ఉప్పెన లాంటి ఒక్క ఒక్క సినిమాతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కృతి శెట్టి.

ఆ సినిమాతో అమ్మడి క్రేజ్ ఓ రేంజ్ కి వెళ్లింది.ఉప్పెన హిట్ తో అరడజను సినిమాలను చేజిక్కించుకున్న కృతి శెట్టి చేస్తున్న సినిమాల్లో కూడా మంచి రోల్స్ ఎంచుకుందని తెలుస్తుంది.

ముఖ్యంగా నితిన్ తో చేస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో కృతి శెట్టి పాత్ర సినిమాకే హైలెట్ గా ఉంటుందని టాక్.

నితిన్ హీరోగా ఎస్.ఆర్ శేఖర్ డైరక్షన్ లో వస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో కృతి శెట్టి పాత్ర చాలా చిన్నదే అని తెలుస్తుంది.

అయితే పాత్ర చిన్నదే అయినా దాని ఇంప్యాక్ట్ చాలా బాగా ఉంటుందని తెలుస్తుంది.

సినిమాలో కృతి శెట్టి పాత్రను చాలా బాగా రాసుకున్నాడట డైరక్టర్ శేఖర్.నితిన్ కూడా ఫస్ట్ టైం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీతో వస్తున్నాడు.

ఈ సినిమాతో నితిన్ మాస్ హీరోగా ప్రమోట్ అవ్వాలని చూస్తున్నాడు.మరి నితిన్, కృతి శెట్టిల రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

తప్పకుండా కృతి శెట్టి పాత్ర క్లిక్ అయితే మాత్రం ఆ సినిమాతో అమ్మడి రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ఫరియా అబ్దుల్లా టాటూ వెనుక సీక్రెట్ ఇదేనా.. ఆ టాటూ వెనుక ఇంత అర్థం ఉందా?