కృతి శెట్టి.. ఓ వెరైటీ ముద్దు పేరు..!

ఉప్పెన, శ్యాం సింగ రాయ్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు కొట్టిన మంగుళూరు భామ కృతి శెట్టి ఈ పొంగల్ కి బంగార్రాజుతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది.

నాగార్జున్, నాగ చైతన్య కలిసి చేసిన ఈ మల్టీస్టారర్ మూవీలో రమ్యకృష్ణతో పాటుగా కృతి శెట్టి కూడా హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా కృతి శెట్టి జోరుగా పాల్గొంటుంది.ఇదిలాఉంటే ఈ క్రమంలో లేటెస్ట్ గా అమ్మడు ఆలీ తో సరదాగా షోకి వచ్చింది.

బంగార్రాజు డైరక్టర్ కళ్యాణ్ కృష్ణతో ఈ షోకి వచ్చింది కృతి శెట్టి.ఈ షోలో భాగంగా ఆలీ కృతి శెట్టి ముద్దు పేరు బయట పెట్టారు.

కృతి శెట్టి ముద్దు పేరు బుంగి అనగానే అమ్మడు షాక్ అయ్యింది.నా ముద్దు పేరు మీకెలా తెలుసు అని కృతి శెట్టి ఆలీ ని అడిగింది.

ఇదే కాదు ఇంకో ముద్దు పేరు కూడా ఉందని అంటాడు ఆలీ.ఇక ఉప్పెన హిట్ తో బార్న్ స్టార్ దగ్గర నుండి ప్రశంసలు అందుకున్నావట.

ఎవరతను అని అడిగారు ఆలీ .అంతేకాదు ఇదివరకు కృతి శెట్టి చేసిన యాడ్స్ గురించి కూడా అడిగి తెలుసుకున్నాడు.

మొత్తానికి ప్రోమోతోనే కృతి శెట్టితో సందడి షురూ చేశారు ఆలీ .ఇక షో మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు.

పనిచేస్తున్న కంపెనీలోనే చోరీ .. ఆపై వేరొకరికి విక్రయం, భారత సంతతి డ్రైవర్‌కు 30 ఏళ్ల జైలు