కృతి శెట్టికి నెగటివ్ మార్కులు.. ఎందుకంటే..!
TeluguStop.com
ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయిన కృతి శెట్టి ఆ హిట్ తో వరుసగా అరడజను సినిమా ఆఫర్లు అందుకుంది.
ఉప్పెన తర్వాత శ్యాం సింగ రాయ్, బంగార్రాజు మరో రెండు హిట్లు పడటంతో అమ్మడు టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అయ్యింది.
లేటెస్ట్ గా రామ్ తో ది వారియర్ సినిమాలో కూడా నటించింది కృతి శెట్టి.
సినిమాలో ఆర్జే విజిల్ మహాలక్ష్మిగా నటించింది కృతి శెట్టి.అయితే ముందు చేసిన 3 సినిమాల్లో కృతి శెట్టి మీద ఎలాంటి నెగటివ్ కామెంట్స్ రాలేదు కానీ ది వారియర్ లో మాత్రం ఆమె గురించి కొన్ని కామెంట్స్ వినపడుతున్నాయి.
లింగుసామి డైరక్షన్ లో తెరకెక్కిన ది వారియర్ సినిమాలో కృతి శెట్టికి బాగా క్లోజప్ షాట్స్ పెట్టాడు.
ఆ షాట్స్ లో అమ్మడు నటన అంత బాగా అనిపించలేదు.విజిల్ మహాలక్ష్మి పాత్రలో కృతి శెట్టి నటన పరంగా ఓకే అనిపించగా ఎక్కువ సీన్స్ లో ఆమెకు క్లోజప్ షాట్స్ పెట్టేసరికి అమ్మడి టాలెంట్ బట్టబయలు అయ్యింది.
అంతేకాదు మహాలక్ష్మి పాత్రలో ఏమంత వేరియేషన్స్ కూడా లేవని అంటున్నారు.మరి కృతి శెట్టి ది వారియర్ సినిమా ఫీడ్ బ్యాక్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
"""/" /
ఇవే కాకుండా సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి చెప్పాలి, నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో కూడా కృతి శెట్టి నటిస్తుంది.
ఈ సినిమాల్లో అయినా కృతి తన నటనతో ఆకట్టుకుంటే ఆమె ఫ్యాన్స్ ఖుషి అయ్యే ఛాన్స్ ఉంది.
ది వారియర్ రిజల్ట్ విషయానికి వస్తే రొటీన్ కథతో అదే రొటీన్ స్క్రీన్ ప్లేతో లింగుసామి తన ఓల్డ్ స్టైల్ సినిమా చేశాడు.
సినిమా టాక్ ఎలా ఉన్నా రామ్ ఎనర్జీ సినిమాని కాపాడేస్తుందని చెప్పుకుంటున్నారు.
ఈ ప్రముఖ టాలీవుడ్ నటి ఇద్దరు కూతుళ్లు డాక్టర్లే.. ఎంతో అదృష్టవంతురాలు అంటూ?