'కస్టడీ' నుండి కృతి ఫస్ట్ లుక్.. ఆసక్తి రేకెత్తిస్తున్న పోస్టర్!

అక్కినేని రెండవ తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వరుస హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక మార్కెట్ సొంతం చేసుకున్నాడు నాగ చైతన్య.

మజిలీ, లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి ప్రేక్షకులకు గుర్తుండి పోయే సినిమాలు చేసిన చైతూకు థాంక్యూ వంటి ప్లాప్ తో డీలా పడిపోయాడు.

అలాగే లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు.కానీ ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది.

దీంతో 2022 ఏడాదిలో వరుసగా రెండు ప్లాప్స్ తో చైతూ నెక్స్ట్ సినిమాను ఆచి తూచి ఎంచుకుని జాగ్రత్తగా పూర్తి చేస్తున్నాడు.

ప్రెజెంట్ తమిళ్ డైరెక్టర్ తో నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

వెంకట్ ప్రభుతో నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసాడు.విభిన్న చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ తమిళ్ డైరెక్టర్ కు చైతూ అవకాశం ఇచ్చాడు.

"""/"/ NC22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇటీవలే 'కస్టడీ' అనే ఆసక్తికర టైటిల్ ను అనౌన్స్ చేసారు.

టైటిల్ పోస్టర్ లో చైతూ పోలీస్ గెటప్ లో ఇంటెన్స్ లుక్ తో ఆకట్టు కున్నాడు.

ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.ఇందులో మరోసారి చైతూతో కృతి శెట్టి కలిసి నటించ బోతుంది.

"""/"/ ఇక తాజాగా ఈ సినిమా నుండి కృతి శెట్టి ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.

ఎప్పుడు గ్లామర్ రోల్ లో మెరిసే కృతి శెట్టి ఈసారి విభిన్న పాత్రలో నటించ బోతున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ చుస్తే అర్ధం అవుతుంది.

ఈ పోస్టర్ మంచి ఆసక్తిగా ఉంది.తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

మరి కొత్త ఏడాదిలో అయినా చైతూ ఈ సినిమాతో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

రాజమౌళి బాటలో నడుస్తున్న సందీప్ రెడ్డి వంగ…