కృష్ణంరాజు స్మృతి వనం : క్షత్రియుల మద్దతు కోసమేనా జగన్ ఆ నిర్ణయం ?

సినీ హీరోగా, నటుడిగా రాజకీయ నాయకుడు ఇలా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకుని అందరికీ సుపరిచితుడుగా , ముద్ర వేయించుకున్న కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే.

ఆయనకు శని రాజకీయ వర్గాలకు ప్రముఖులంతా నివాళులు అర్పించారు.నిన్ననే కృష్ణంరాజు పెద్దకర్మను ఆయన స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఏర్పాటు చేశారు.

దాదాపు లక్ష మందికి పైగా జనాలకు విభిన్న రకాల వంటకాలతో భోజనాలను పెట్టారు.

ఈ కార్యక్రమానికి కొంతమంది సినీ ప్రముఖులు హాజరవగా వైసీపీ మంత్రులు రోజా, కారుమూరు నాగేశ్వరావు తోపాటు,  మరికొంతమంది ప్రముఖులు హాజరయ్యారు.

సినీ హీరో ప్రభాస్ నూ ఈ సందర్భంగా పరామర్శించారు.కృష్ణంరాజు సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరిలోనే ఆయన స్మృతి వనం నిర్మించాలని ఆయన కుటుంబ సభ్యులు భావించారు.

ఈ విషయాన్ని రాజకీయ ప్రముఖుల వద్ద ప్రస్తావించగా, ఏపీ ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించింది.

కుటుంబ సభ్యుల కోరిక మేరకు నరసాపురం దగ్గరలోని పేరుపాలెం బీచ్ ప్రాంతంలో రెండు ఎకరాల స్థలాన్ని కొనాలన్న కృష్ణంరాజు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

ఆ ప్రాంతంలో ఎక్కడ స్మృతి వనం నిర్మించాలని అనుకుంటున్నారో సూచిస్తే అక్కడ ప్రభుత్వం స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు ప్రకటించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.అసలు స్మృతి వనం నిర్మించాలని కృష్ణంరాజు కుటుంబ సభ్యులు అనుకున్న వెంటనే ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం వెనక రాజకీయ లెక్కలు చాలానే ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

"""/"/ రాబోయే ఎన్నికల్లో క్షత్రియ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు జగన్ ఈ విషయంలో సానుకూలంగా రియాక్ట్ అయ్యారని, వచ్చే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ హారాహోరీగా ఉండబోతుందని, కాపులు రాజులతో రాజకీయం చేసి ఈ స్థానాన్ని దక్కించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తూ ఉండగా,  టిడిపి సైతం బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి ఈ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.

అలాగే రాబోయే ఎన్నికల్లో బిజెపి తరఫున ఎంపీ అభ్యర్థిగా ప్రభాస్ సోదరుడు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, క్షత్రియ సామాజిక వర్గం తమకు దూరం కాకుండా ఆ సామాజిక వర్గం విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగానే ఉంటుందనే అభిప్రాయాన్ని కలిగించేందుకు జగన్ ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి.

పైసా ఖ‌ర్చు లేకుండా ఇంట్లో ఉండే ఈ రెండిటితో హెయిర్ ఫాల్‌కు చెక్ పెట్టొచ్చు.. తెలుసా..?