ఎన్టీఆర్, ఎస్వీఆర్ అనూహ్య ప్రవర్తనతో ఆశ్చర్యపోయిన కృష్ణంరాజు..?

ఆర్టిస్టులు ప్రశంసల కోసం పాకులాడుతారని స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.కొంచెం పొగిడితే చాలు వారు మరింత ఉత్సాహంతో ఇంకా మంచిగా పని చేయడానికి ప్రయత్నిస్తారు.

అయితే సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన ఆర్టిస్టులకు ఇలాంటి ప్రశంసలు దొరకడం చాలా అరుదు.

నిజానికి కొత్త ఆర్టిస్టుకు ఎక్కువగా అవమానాలు ఎదురవుతుంటాయి.అందంగా లేవని, లావుగా ఉన్నావని, సరిగా యాక్ట్ చేయడం రావడం లేదని ఇలా ఎన్నో విధాలుగా దర్శకులు, సీనియర్ నటులు( Directors , Senior Actors ) దెప్పిపొడుస్తుంటారు.

అయితే అందరూ నటులు అలా చేస్తారని కాదు.కొందరు సినిమాల్లో ఆల్రెడీ హీరోలుగా రాణిస్తున్నా ఇతరులను కూడా ప్రోత్సహిస్తారు.

వారిని కూడా పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు.అలాంటి వారిలో ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ ( Senior NTR )ఉంటారని చెప్పుకోవచ్చు.

కృష్ణ, మోహన్ బాబు, చిరంజీవి( Krishna, Mohan Babu, Chiranjeevi ) లాంటి ఎంతో మంది హీరోలను ఎన్టీఆర్ బాగా ప్రశంసించేవారు.

వారిని పైకి రావాలని ప్రోత్సహించేవారు.వారిని ఫ్యామిలీ మెంబర్స్ గా క్రియేట్ చేస్తూ మద్దతు ఇచ్చేవారు.

ఇక ఎస్వీ రంగారావు కూడా కొత్త నటులను మంచిగా పలకరిస్తూ మంచిగా నటిస్తే ప్రశంసలు కురిపించేవారు.

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు( Rebelstar Krishnamraju ) వీరిద్దరి ప్రవర్తన చూసి అప్పట్లో ఆశ్చర్యపోయారట.

బతికున్నప్పుడు కృష్ణంరాజు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.అందులో ఎన్టీఆర్ ఎస్వీఆర్ ఎంత మంచి వారో, మిగతా ఇండస్ట్రీకి వారి అంత భిన్నంగా ఉండేవారో చెప్పుకొచ్చారు.

అంత పెద్ద నటులు తనను పొగడ్తలతో ముంచేస్తుంటే ఎంతో ఆనందంగా, అలాగే ఆశ్చర్యకరంగా అనిపించాలని కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో హీరోగా ఎదిగానంటే దానికి వీరిద్దరే కారణమని తెలిపారు. """/" / 1966 నాటి ‘చిలకా గోరింకా’ సినిమాతో( Chilaka Gorinka ) కృష్ణంరాజు కథానాయకుడిగా వెండితెరపై పరిచయమయ్యాడు.

దీనికి కె.ప్రత్యగాత్మ ( K.

Pratyagatma ) దర్శకత్వం వహించారు.అయితే సినిమా చిత్రీకరణ సమయంలో ఒక సమస్య వచ్చింది.

అదేంటంటే సీన్ పేపర్స్ మద్రాస్‌లో ఉండిపోయాయి, మేకర్స్ వేరే దగ్గర ఉన్నారు.అవి రావడానికి బాగా ఆలస్యం అయింది.

అప్పటికే రంగారావు డేట్స్ బాగా అయిపోయాయి.దానివల్ల ఆయనలో అసహనం పెరిగిపోయింది.

పైగా తాను కొత్త కుర్రాడు అయినా కృష్ణంరాజుతో కలిసి కొన్ని సీన్లు తీయాల్సి ఉందని తెలిసింది.

"టైమ్ లేదు, కొత్త కుర్రాడు అంటున్నారు ఇక ఈ సినిమా అయినట్టే" అని ఎస్వీఆర్ నిరుత్సాహపడ్డారట.

"""/" / కానీ కృష్ణంరాజు ప్రతి సీన్‌ను సింగల్ టేక్‌లో కంప్లీట్ చేయడం చూసి ముగ్ధులయ్యారట.

ఒక్కరోజు టైం పట్టాల్సిన షూటింగ్ కేవలం రెండు గంటల్లో పూర్తయిందట.దాంతో ఎస్వీఆర్ "భేష్ బాగా నటించావు" అంటూ కృష్ణంరాజును బాగా పొగిడారట.

అంతేకాదు, ఆయన గురించి మిగతా నటులకు కూడా చెప్పారట.అలా చేయడంవల్ల మద్రాస్ కు వెళ్లగానే సినిమా వాళ్ళందరూ కృష్ణంరాజును పొగడటం స్టార్ట్ చేశారు.

ఇది చూసి ఆయన ఆశ్చర్యపోయారు.కృష్ణంరాజు నిర్మించిన కృష్ణవేణి సినిమా చూసి ఎన్టీఆర్ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు.

చివరి వరకు ఎస్వీఆర్, ఎన్టీఆర్ కృష్ణంరాజునం పొగుడుతూనే ఉండేవారు.

వైరల్ వీడియో: ఒక్కసారిగా కుక్క పిల్లను చుట్టేసుకున్న పాము.. చివరికి ఏమైందంటే..?