కృష్ణ వంశీ రంగమార్తాండ కూడా ఓటీటీ బాటలోనే

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా రంగ మార్తాండ.

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా మరాఠీలో నానా పాటేకర్ లీడ్ రోల్ లో తెరకెక్కిన నట సామ్రాట్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది.

నట సామ్రాట్ సినిమా చూసిన కృష్ణవంశీ ఎంతో ఇష్టపడి రీమేక్ హక్కులు కొని చేస్తున్న సినిమా ఇది.

బేసిక్ గా కృష్ణ వంశీ రీమేక్ కథల జోలికి ఎప్పుడు వెళ్ళడు.ఇప్పటి వరకు అతని కెరియర్ లో చేసిన సినిమాలు అన్ని కూడా సొంత కథలతోనే తెరకెక్కాయి.

అయితే నట సామ్రాట్ కథ నచ్చడంతో ఎలాంటి స్టార్ హీరోలు లేకుండా కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతో ఆ సినిమా చేస్తున్నాడు.

ఇందులో అనసూయ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలలో నటిస్తున్నాడు.చాలా హృద్యమైన కథ, కథనంతో దీనిని కృష్ణవంశీ తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా ఆవిష్కరించబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది.అయితే సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్న ప్రస్తుతం కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో కేంద్ర ప్రభుత్వం థియేటర్లు ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది.

అయితే ఈ స్థాయి ఆక్యుపెన్సీతో సినిమాలు రిలీజ్ చేస్తే అటు థియేటర్ యజమానులుకి, ఇటు నిర్మాతలకి కూడా నష్టం అని భావిస్తున్నారు.

పూర్తి స్థాయిలో థియేటర్లు యాక్టివ్ అవ్వాలంటే జనవరి పడుతుంది.ఈ నేపథ్యంలో రంగమార్తాండ సినిమాని ఓటీటీలోనే రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ విషయంలో కృష్ణవంశీ కొంత అసంతృప్తిగా ఉన్నా కూడా ఒప్పించడం జరిగిందని సమాచారం.

అలాగే ఓటీటీ సంస్థతో కూడా ఒప్పందం జరిగిపోయిందని తెలుస్తుంది.త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు బోగట్టా.

రెండేళ్ల తర్వాత గూగుల్ స్ట్రీట్ వ్యూలో భార్య ఆచూకీ.. చివరికేమైందో తెలిస్తే..?