ఇండస్ట్రీలో అనాథను అయిపోయాను.. వైరల్ అవుతున్న కృష్ణవంశీ ఎమోషనల్ కామెంట్స్! 

ఒకప్పుడు తన సినిమాలతో ఇండస్ట్రీలో చక్రం తిప్పిన దర్శకుడు కృష్ణవంశీ.( Krishna Vamsi ) క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ తన కథలతో హీరో ఇమేజ్ ని అమాంతం పెంచేస్తారు.

కుటుంబం, బంధాలు, ప్రేమ వంటి ఎలిమెంట్స్ ని చాలా బాగా చూపిస్తారు.నాగార్జునకి నిన్నే పెళ్ళాడుతా, మహేష్ బాబు కి మురారి సినిమాలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి.

కృష్ణవంశీకి దేశమంటే అపారమైన భక్తి, దానికి ఖడ్గం సినిమాయే( Khadgam Movie ) ఉదాహరణ.

సమాజం మీద బాధ్యత దేశం మీద ప్రేమ వంటివి తన కథల ద్వారా వ్యక్త పరుస్తారు.

అలాంటి కృష్ణవంశీ ఈ మధ్య దర్శకుడుగా కాస్త వెనుకబడ్డారని చెప్పాలి.ఆయన రీసెంట్ గా తీసిన రంగమార్తాండ సినిమా( Rangamarthanda ) విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.

అయితే చాలా రోజుల తర్వాత ఒక ఈవెంట్లో పాల్గొన్న కృష్ణవంశీ ఇండస్ట్రీలో అనాధని అయిపోయానంటూ ఎమోషనల్ అయినా సంఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది ఇంతకీ ఏం జరిగిందంటే తన పాటలతో చైతన్యం కలిగించిన గొప్ప గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి మే 20.

"""/" / ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ నా ఉఛ్వాసం కవనం( Naa Uchhwasam Kavanam ) అనే పేరుతో ఒక ఈవెంట్ ని నిర్వహించారు.

ఆ ఈవెంట్లో పాల్గొన్న కృష్ణవంశీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి( Sirivennela Sitarama Sastry ) గారి గురించి మాట్లాడుతూ ఆయన తో 1989 నుంచి పరిచయం ఉంది, ఆయన దొరకటం మహా అదృష్టం, ఏ అర్హత లేకపోయినా తనని కొడుకుగా స్వీకరించారని, వాళ్ళ ఇంట్లోనే ఉండే వాళ్ళమని అన్నారు.

"""/" / ఆయన ఉంటే ధైర్యంగా ఉంటుందని ఆరేడు నెలల నుంచి సినిమా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను కానీ పాటలు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

ఆయన ఉన్నప్పుడు ఇలాంటి పాటలు ఉంటాయి, ఇలాంటి కథ ఉంటుంది అని అనుకొని ఆయన దగ్గరికి వెళ్లేవాడిని అన్నారు.

అలాంటిదే ఆయన ఇవాళ లేకపోవడంతో ఒక రకంగా అనాధని అయిపోయాను అంటూ కన్నీరు పెట్టుకున్నారు కృష్ణవంశీ.

అమెరికాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తెలుగు వైద్యురాలు దుర్మరణం