తెలంగాణ తీరుపై కృష్ణా రివర్ మేనేజ్‎మెంట్ కమిటీ అసహనం

తెలంగాణ తీరుపై కృష్ణా రివర్ మేనేజ్‎మెంట్ కమిటీ అసహనం వ్యక్తం చేసింది.ఈ సమావేశానికి తెలంగాణ అధికారుల గైర్హాజరుపై మండిపడ్డారు.

చివరి ప్రయత్నంగా భేటీకి రావాలని కేఆర్ఎంసీ కన్వీనర్ రవికుమార్ కోరారు.అయితే తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సమావేశానికి రావడం లేదని అధికారులు సమాచారం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో గైర్హాజరును క్రమశిక్షణ రాహిత్యంగానే భావిస్తామని కేఆర్ఎంసీ వెల్లడించింది.ఈ మేరకు తెలంగాణ క్రమ శిక్షణారాహిత్యంపై కేఆర్ఎంబీకి కేఆర్ఎంసీ లేఖ రాస్తామని తెలిపింది.

అనంతరం ఏపీ అధికారులతోనే కేఆర్ఎంసీ సమావేశాన్ని ముగించింది.ఈ సమావేశంలో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టుపై మేనేజ్ మెంట్ కమిటీ నిర్ణయంపై ఏపీ సంతకం చేసింది.

రబీ సీజన్ కోసం కృష్ణాలో 104 టీఎంసీల నీటిని ఏపీ కోరుతుంది.సాగర్ లో 74 టీఎంసీలు, శ్రీశైలంలో 30 టీఎంసీలు కోరుతుంది.

కార్మికులను బెల్టుతో ఇష్టానుసారం కొట్టిన చైనా వ్యక్తి.. వైరల్ వీడియో…?