కృష్ణాష్టమి రోజు కన్నయ్యను ఏ విధంగా పూజించాలో తెలుసా?

హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున దేశవ్యాప్తంగా హిందువులు పెద్ద ఎత్తున శ్రీకృష్ణాష్టమి ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఈ శ్రీకృష్ణాష్టమినే శ్రీ కృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి, కృష్ణజయంతి అనే వివిధ రకాల పేర్లతో జరుపుకుంటారు.

కృష్ణాష్టమి రోజు భక్తులు పెద్ద ఎత్తున శ్రీ కృష్ణుడికి ప్రత్యేక అలంకరణలు చేసి, భక్తిశ్రద్ధలతో ఉపవాసంతో కన్నయ్యను పూజిస్తారు.

అసలు కృష్ణాష్టమి జరుపుకోవడానికి కారణం ఏమిటి?కృష్ణాష్టమి రోజు కన్నయ్యని ఏ విధంగా పూజించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం లోక సంరక్షణార్ధం పాపులను సంహరించడానికి విష్ణుమూర్తి వివిధ అవతారాలను సంగతి మనకు తెలిసిందే.

అయితే విష్ణువు దశావతారాలలో ఎనిమిదవ అవతారము శ్రీ కృష్ణ అవతారం.ప్రజలను ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి కంసుడిని వధించడం కోసం విష్ణువు శ్రీ కృష్ణ అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలోనే దేవకికి కృష్ణుడు చెరసాలలో జన్మించి యశోద పెంపకంలో పెరిగి చివరికి కంసుడిని సంహరిస్తాడు.

ఈ విధంగా కంసుడిని సంహరించడం వల్ల ప్రజలు కృష్ణ జయంతి రోజున శ్రీ కృష్ణాష్టమిగా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

"""/"/ ఇక కృష్ణాష్టమి రోజు ఉదయం నిద్ర లేచి ఇంటి శుభ్రపరుచుకుని కన్నయ్యకు ప్రత్యేకంగా అలంకరణలు చేసి ఈ పండుగను జరుపుకుంటారు.

కృష్ణాష్టమి రోజు చిన్ని కృష్ణుడిని మూడు రకాలుగా ఆరాధిస్తారు.మొదటి ఆరాధన: సూర్యోదయానికి ముందుగానే ఉపవాసంతో కృష్ణుడిని ఆరాధిస్తారు.

"""/"/ రెండవ ఆరాధనకృష్ణుడికి రెండవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు చేస్తారు.ఈ సమయంలో ముందుగా కన్నయ్య తల్లి దేవకికి నీటిని అర్పించి పూజించిన తరువాత కన్నయ్యను పూజిస్తారు.

"""/"/ మూడవ ఆరాధనకృష్ణుడికి మూడవ ఆరాధన ఎంతో పవిత్రమైనది.ఆరాధన అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.

ఈ విధంగా అర్ధరాత్రి కృష్ణుడిని పూజించడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.

శ్రీకృష్ణుడు జన్మించినది అర్ధరాత్రి కనుక అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున పూజలు చేసి, భక్తులు ఉపవాస దీక్షను వదులుతారు.

ఈ విధంగా వివిధ రకాల నైవేద్యాలతో, శ్రీకృష్ణ సహస్రనామాలను, బాలకృష్ణ స్తోత్రం చదువుతూ, శ్రీకృష్ణ లీలలు వింటూ భక్తులు జాగరణ చేసి కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఇలా చేయటం వల్ల భక్తులకు కోరిన కోరికలను కన్నయ్య నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తారు.

కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు..: కిషన్ రెడ్డి