Superstar Krishna : ఆ విషయం లో ఎన్టీయార్ ను నాగేశ్వర రావు ను బీట్ చేసిన కృష్ణ…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ( Krishna ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకునేది ఇక ఆయన తనకు పోటీ ఎవరూ లేరు అనేంతలా సినిమాలు చేస్తూ ముందుకు సాగాడు.
ఇలాంటి కృష్ణ తన దైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఎన్నో ఒడిడుకులను సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇక ఎక్కడ తగ్గకుండా సినిమాకు సంబంధించిన ప్రయోగాలను ఎక్కువగా చేస్తూ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఏర్పాటు చేసుకున్నాడు.
"""/" /
ఇక ఇలాంటి క్రమంలోనే కృష్ణ మూడు షిఫ్ట్ లుగా సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటూ చాలా ఎక్కువ సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తూ వచ్చాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే నాగేశ్వరరావు, ఎన్టీఆర్( Akkineni Nageswara Rao ) కి కూడా సాధ్యం కానీ విధంగా మూడు షిఫ్ట్ లు సినిమా షూటింగ్ లో పాల్గొనడం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది.
ఇక ఎన్టీఆర్, నాగేశ్వరరావు యాక్టింగ్ పరంగా సినిమాల సక్సెస్ ల పరంగా కృష్ణ కంటే గ్రేట్ అయినప్పటికీ సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం ఎక్కువ సినిమాలు రిలీజ్ చేయడంలో కృష్ణని తోపు హీరో అని చెప్పడంలో ఎంత మాత్రం శక్తి లేదు.
ఇలా కృష్ణ సాధించిన ఈ ఘనతని ఇప్పుడున్న హీరోలు సైతం ఎవరు సాధించలేరు.
ఎందుకంటే ఆయన ఒక సంవత్సరంలో 20 సినిమాలు రిలీజ్ చేసి చరిత్ర సృష్టించాడు కానీ ఇప్పుడున్న హీరోలు వాళ్ల ఎంటైర్ కెరియర్ లో 20 సినిమాలు చేస్తున్నారు.
"""/" /
ఇలా కృష్ణ గారు సినిమాలు( Krishna ) చేసినట్టుగా ప్రస్తుతం ఉన్న హీరోలు ఎవరు కూడా సినిమాలు చేయడం లేదు అనే విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు.
ఇక మొత్తానికైతే తనకున్న ఫ్యాన్స్ ని కాపాడుకోవడం లో కృష్ణ ఎప్పుడు ముందు వరుసలో ఉండేవాడనే చెప్పాలి.
ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్ చేస్తానని రామ్ చరణ్ చెప్పారా.. ఏం జరిగిందంటే?