ఎన్టీఆర్ ను అభినందిస్తూ కృష్ణ దినపత్రికలో ఇచ్చిన ప్రకటన గురించి మీకు తెలుసా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ మధ్య సినిమాల విషయంలో పోటీ ఉండేదనే సంగతి తెలిసిందే.
కొన్ని సందర్భాల్లో సీనియర్ ఎన్టీఆర్ పై చేయి సాధిస్తే మరికొన్ని సందర్భాల్లో కృష్ణ సినిమాల విషయంలో పై చేయి సాధించారు.
అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించి ముఖ్యమంత్రి అయిన సమయంలో ఇచ్చిన పేపర్ ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
కృష్ణ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఈనాడు కూడా ఒకటి.
ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈనాడ్ సినిమ రీమేక్ కావడం గమనార్హం.
మొదట కృష్ణ ముత్యాల ముగ్గు శ్రీధర్ హీరోగా ఈ సినిమాను తీయాలని భావించారు.
పి.సాంబ శివరావును ఆ సినిమాకు డైరెక్టర్ గా ఎంపిక చేసి ఆ సినిమాకు మాటలు రాయడానికి పరుచూరి బ్రదర్స్ ను కృష్ణ ఎంపిక చేశారు.
అయితే పరుచూరి బ్రదర్స్ కు ఆ సినిమాలో కృష్ణ హీరోగా నటిస్తే బాగుంటుందని అనిపించింది.
"""/"/
కృష్ణ బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా మార్పులు చేసి కృష్ణ ను ఈ సినిమాలో నటించేలా పరుచూరి బ్రదర్స్ వెల్లడించారు.
కృష్ణ 200వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కింది.సమాజం కొరకు లైఫ్ ను త్యాగం చేసిన వ్యక్తి పాత్రలో కృష్ణ ఈ సినిమాలో నటించారు.
1982 సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా సక్సెస్ సాధించింది.
ఈ సినిమాలో కృష్ణ, ఇతరులు రండీ కదిలిరండి అంటూ సైకిల్ తొక్కుతూ పాడే పాట సినిమాకు హైలెట్ గా నిలిచింది.
"""/"/
ఈనాడు సినిమాను చూసిన సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కృష్ణ ఎన్టీఆర్ కు మద్దతుగా ఆ పాటలో నటించారని అనుకున్నారు.
ఈనాడు మూవీ రిలీజైన రెండు వారాల తర్వాత టీడీపీ ఘన విజయం సాధించి ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు.
ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ ఎన్నికల్లో గెలవడాన్ని అభినందిస్తూ కృష్ణ పేపర్ లో ఇచ్చిన యాడ్ అప్పట్లో వైరల్ అయింది.
నేను ధనవంతురాలిని కాదు….నా దగ్గర సహాయం చేసేంత డబ్బు ఉంది: సాయి పల్లవి