ఎనిమిది నెలల కొడుకుకు ఫీవర్.. అయినా షూటింగ్ కు వెళ్లా.. కష్టాలు చెప్పుకున్న ప్రముఖ నటి!
TeluguStop.com
సినిమా రంగానికి సంబంధించిన నటీనటుల జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి.కొంతమంది ఆ కష్టాలను చెప్పుకోవడానికి ఇష్టపడితే మరి కొందరు మాత్రం ఆ కష్టాలను చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు.
క్రాంతి బలివాడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాల్యంలో తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నానని చెప్పారు.
యూకేజీ సమయంలోనే తాను భక్త ప్రహ్లాద పాత్రను పోషించానని ఆమె చెప్పుకొచ్చారు.సొంతంగా తనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందని లాక్ డౌన్ సమయంలో వీడియోలు పోస్ట్ చేశానని ఇప్పుడు మాత్రం వీడియోలను అప్ లోడ్ చేయడం లేదని ఆమె వెల్లడించారు.
నటిగా గొప్ప పాత్ర అయితే తన కేరీర్ లో లేదని అయితే మంచి పాత్రలలో నటించిన సినిమాలు త్వరలో రిలీజ్ కానున్నాయని క్రాంతి బలివాడ చెప్పుకొచ్చారు.
ఇప్పటి వరకు 40 సినిమాలు చేసినా అద్బుతమైన పాత్రలు మాత్రం చేయలేదని ఆమె తెలిపారు.
కరోనా సమయంలో పక్షవాతం వల్ల నాన్న చనిపోయారని ఆమె అన్నారు. """/" /
శ్రీకాకుళంలో తన తల్లిదండ్రులు ఉన్నారని సెకండ్ వేవ్ సమయంలో వెంటిలేటర్ దొరికే సమయానికి నాన్న చనిపోయారని క్రాంతి చెప్పుకొచ్చారు.
తల్లిదండ్రులకు తాను మాత్రమే కూతురినని ఆమె వెల్లడించారు.ఆర్టిస్టులకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సీరియల్ షూటింగ్ లో పాల్గొనాలని క్రాంతి వెల్లడించారు.
"""/" /
కొడుకుకు వైరల్ ఫీవర్ ఉన్న సమయంలో కూడా షూటింగ్ లో పాల్గొన్నానని ఆమె చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో తన వయస్సు ఎనిమిది నెలలు అని క్రాంతి అన్నారు.ఫిల్మ్ సిటీలో అప్పుడు సీరియల్ షూటింగ్ జరిగిందని కొన్ని పరిస్థితులను అవైడ్ చేయడం సాధ్యం కాదని క్రాంతి వెల్లడించారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్ షూటింగ్ సమయంలో ఈ ఘటన జరిగిందని ఆమె అన్నారు.
ఆఫీస్ లో ఉంటే లీవ్ తీసుకోవచ్చని యాక్టింగ్ చేసేవాళ్లకు లీవ్ తీసుకోవడం సాధ్యం కాదని క్రాంతి కామెంట్లు చేశారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ వస్తుందా.. ఈ కాంబోలో సీక్వెల్ వస్తే హిట్ అంటూ?