బరువు తగ్గడం కోసం బాగానే కష్టపడుతున్న జయమ్మ...
TeluguStop.com
ఈ ఏడాది టాలీవుడ్ మాస్ మహారాజా రవి తేజ మరియు ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కిన క్రాక్ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి జయమ్మ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తమిళ ప్రముఖ నటి "వరలక్ష్మి శరత్ కుమార్" గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే క్రాక్ చిత్రం మంచి హిట్ అవడంతో ఈ అమ్మడికి వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.
దీంతో ప్రస్తుతం దాదాపుగా 7 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూ దూసుకు పోతోంది.
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగులను కొంతకాలం పాటు తాత్కాలికంగా నిలిపి వేశారు.
దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ కొంతమేర బరువు తగ్గే పనిలో పడింది.ఇందులో భాగంగా ఎక్కువ సమయం జిమ్ లో వర్కవుట్ చేస్తూ గడుపుతోంది.
అంతేకాకుండా ఆహారపు డైట్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.కాగా తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వరలక్ష్మి శరత్ కుమార్ జిమ్ లో వర్కవుట్లు చేస్తుండగా తీసినటువంటి వీడియోని షేర్ చేసింది.
అంతేకాకుండా "మీరు ఎక్కడున్నా సరే ఆరోగ్యంగా ఉండాలంటూ" క్యాప్షన్ కూడా పెట్టింది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో హీరో "సందీప్ కిషన్" హీరోగా నటిస్తున్న మరో కొత్త చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
అలాగే తన తండ్రి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "పంబాన్" చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
బంగాళదుంప తింటే బరువు పెరుగుతారా..?