మెగా హీరోతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్న క్రాక్ డైరెక్టర్!

దాదాపు సంవత్సరం నుంచి థియేటర్లలో సినిమా సందడి కనిపించలేదు.దానికి కారణం కరోనా మహమ్మారి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే ఎన్నో రోజుల తర్వాత ఎన్నో సందేహాలు, అనుమానాల మధ్య సంక్రాంతి పండుగకు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన"క్రాక్" సినిమా ఎవరూ ఊహించి నటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇంత కష్టకాలంలో థియేటర్ లో విడుదలైన ఈ సినిమా విజయం గురించి ఎవరు మర్చిపోరు.

అంతేకాకుండా రవితేజ నటించిన సినిమాలలో ది బెస్ట్ ఓపెనింగ్ సినిమా క్రాక్ అని చెప్పవచ్చు.

ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో భారీ ఆఫర్లు వస్తున్నాయి.

క్రాక్ సినిమా గురించి పాజిటివ్ టాక్ రావడంతో ఇండస్ట్రీలో ఉన్న సినీ పెద్దలు గోపీచంద్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో దర్శకుడిగా కొనసాగిస్తున్న దర్శకుడు గోపీచంద్ మలినేని అందరికీ పరిచయమే.

ప్రస్తుతం క్రాక్ మంచి విజయం అందుకోవడంతో ఇండస్ట్రీలోని అగ్రహీరోల దృష్టి మొత్తం ఈ దర్శకుడి పై పడింది.

"""/"/ గోపీచంద్ క్రాక్ సినిమా మంచి హిట్ టాక్ రావడంతో మెగాస్టార్ చిరంజీవి సైతం గోపీచందనం కలిసి మాట్లాడారు.

ఇద్దరి మధ్య చాలా సేపు చర్చ జరిగిన అనంతరం ఒక మంచి కథ ఉంటే చూడమని మెగాస్టార్ చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు బాలకృష్ణ తో కూడా సినిమా చేస్తున్నట్లు స్వయంగా గోపీచంద్ తెలియజేశారు.ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలకు దర్శకత్వం వహించాలని ముందుగానే అడ్వాన్స్ ఇవ్వడం విశేషం అని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం గోపీచంద్ రెండు సినిమాలు పూర్తయ్యేలోపు మెగాస్టార్ సినిమాలు కూడా విడుదల కావడంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కచ్చితంగా తెరకెక్కుతుందని సమాచారం వినబడుతోంది.

గ్రీన్ టీ తో ఈ విధంగా చేశారంటే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతమవుతుంది!