కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కోటంరెడ్డి ఫిర్యాదు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రానికి లేఖ రాశారు.తన ఫోన్ ట్యాప్ అయిందని, దానిపై సమగ్ర విచారణ జరపాలని లేఖలో కోరారు.

గత కొన్ని రోజులుగా తన ఫోన్ ను వైసీపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

తన సంభాషణలను దొంగచాటుగా వింటున్నారని ఆరోపిస్తూ.తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

అయితే కోటంరెడ్డి ఆరోపణలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కొట్టివేశారు.అసలు కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని తెలిపారు.

ఫోన్ మాట్లాడే సమయంలో కాల్ రికార్డింగ్ చేశారన్న సజ్జల ఫోన్ ట్యాపింగ్ జరగనప్పుడు విచారణ ఎందుకని ప్రశ్నించారు.

దీంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి.

ఈ న్యాచురల్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ గ్లో..!