చిరంజీవి సినిమా షూటింగ్ లో "కోట" 5 గంటల ఆలస్యం ..చివరికి.. ?

చిరంజీవి సినిమా ఇండ‌స్ట్రీలో అప్పుడ‌ప్పుడూ స్టార్ హీరోగా ఎదుగుతున్న రోజుల‌వి.అప్ప‌టికే ఆయ‌న‌కు సుప్రీం హీరో అనే బిరుదు సైతం వ‌చ్చింది.

కెరీర్ మంచి స్వింగ్ లో ఉంది.అప్పుడే ఖైదీ నెంబ‌ర్ 786 సినిమా చేసేందుకు చిరంజీవి ఓకే చెప్పారు.

ఈ సినిమాలో విల‌న్ పాత్ర చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంది.దీనికి మంచి న‌టుడిని ఎంపిక చేయాల‌నుకున్నారు.

ఆ దిశ‌గా సెర్చింగ్ మొద‌లు పెట్టారు మూవీ ప్రొడ్యూస‌ర్ విజ‌య బాపినీడు.ఆలోచించి ఆలోచించి రావు గోపాల‌రావు అయితే బాగుంటుంది అని ఆయ‌న ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు.

కానీ చిరంజీవికి రావు గోపాల‌రావు కంటే కోటా శ్రీ‌నివాస‌రావు అయితే బాగుంటుంది అనిపించింది.

అందుకే నిర్మాత బాపినీడుకు ఇష్టం లేక‌పోయినా.ప‌ట్టుబ‌ట్టి కోటాను ఓకే చేయించారు చిరంజీవి.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.సీన్ కట్ చేస్తే.

సినిమా షూటింగ్ మొద‌లైంది.ఆ రోజు కోట శ్రీనివాసరావు, చిరంజీవి స‌హా మిగ‌తా ప్ర‌ముఖ న‌టులు అందరూ షూట్ లో పాల్గొనాలి.

అందరూ సెట్ కి వచ్చారు.కోట శ్రీ‌నివాస‌రావు మాత్రం ఎక్కడా కనబడలేదు.

చిరంజీవి సైతం ఏమైంది కోట గారు రాలేదా అని ఆరా తీశారు.అటు కోట మాత్రం కృష్ణగారు హీరోగా నటిస్తున్న పరశురాముడు అనే సినిమా షూట్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

పైగా కోర్టు ఎపిసోడ్‌ షూటింగ్ కాబట్టి సీరియస్ గా జరుగుతోంది.అదే రోజు తనకు చిరంజీవి సినిమా తొలి రోజు షూటింగ్‌ ఉందని కోట శ్రీనివాసరావుకి తెలుసు.

కానీ రెండు గంటల్లో షూట్ అయిపోతుంది.ఇంపార్టెంట్‌ సీన్.

మీరు రావాలి అంటూ కృష్ణ అడిగే సరికి కోట కాద‌న‌లేక‌పోయారు.షూటింగ్ కి వెళ్లారు.

రెండు గంటలు అనుకున్న షూటింగ్ కాస్త ఐదు గంటలు ప‌ట్టింది.అక్క‌డ షూటింగ్ అయిపోగానే కోట చాలా టెన్ష‌న్ గా చిరు సినిమా సెట్ కి బయలుదేరాడు.

"""/"/ అసలుకే చిరంజీవిగారితో తొలి సినిమా.పైగా చిరు రికమండ్ చేయించి ఫస్ట్ టైం తనకు మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇప్పించారు.

పైగా ఆరు గంటలు ఆలస్యం అయింది, చిరంజీవి ఏమనుకుంటారో ఏమో? అసలు నన్ను ఉంచుతారో? ఉంచ‌రో ? అనుకుంటూ కోట శ్రీనివాసరావు భయపడుతూ చిరంజీవి సినిమా సెట్ కి వచ్చాడు.

ఎదురుగా నిర్మాత విజయ బాపినీడు సీరియస్ గా చూస్తున్నారు.కోపంగా ఏమయ్యా ఏమనుకుంటున్నావ్‌? ఇక్కడ పెద్ద నటులందరూ ఎదురుచూస్తున్నారని ఆవేశంతో ఊగిపోతున్నారు.

కోట భయం భయంగానే దూరంగా ఉన్న చిరంజీవి దగ్గరికి వెళ్లి వివ‌ర‌ణ ఇవ్వ‌బోయాడు.

వెంట‌నే చిరు క‌లుగ‌జేసుకున్నారు.టెన్షన్ ఏమీ లేదండీ.

ఆర్టిస్టుగా బిజీ అవుతున్నకొద్దీ ఇలా కాల్షీట్ల సర్దుబాటు తప్పదు అని చిన్న చిరునవ్వుతో అన్నారు.

ఎదుటివారి సమస్యను చిరు అంత బాగా అర్ధం చేసుకునే వారు అని ఇప్ప‌టికీ చెప్తారు కోట శ్రీ‌నివాస‌రావు.

కష్టపడి అలసిపోయిన సురేఖ.. దుబాయ్ ట్రిప్ తీసుకెళ్లిన మెగాస్టార్?