జడ్పిహెచ్ఎస్ పాఠశాలకు 50వేల రూపాయల విరాళం అందించిన కోట సతీష్
TeluguStop.com
పలు దేవాలయాలకు సిమెంటు,ఇసుక,కాంక్రీట్ అందజేత రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న స్వీపర్స్ కు తన వంతు సహాయంగా సంవత్సరానికి సరిపడే వేతనంగా రాచర్ల గొల్లపల్లి కి చెందిన కోట రాజేశం కుమారుడు కోట సతీష్ కుమార్, 50.
000వేల రూపాయలను విరాళంగా గ్రామ సర్పంచ్ పాశం సరోజనా దేవరెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ జబ్బర్, ఎస్ఎంసి చైర్మన్ గోగురి శ్రీనివాస్ రెడ్డి, పాటి దేవయ్య చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి కి అందజేయడం జరిగింది.
ఇలాగే గొల్లపల్లి గ్రామంలో పలు దేవాలయాలకు తన వంతు సహాయంగా గ్రైనేట్స్, సిమెంటు, ఇసుకను , విరాళంగా ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.
గ్రామ అభివృద్ధికి తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్న సతీష్ కుమార్ ను పాఠశాల యజమాన్యం, విద్యార్థిని,విద్యార్థులు, గ్రామ ప్రజల తరపున ప్రత్యేకంగా అభినందన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్,రవి, విద్యార్థిని,విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ బీచ్: నేవీ విన్యాసాల్లో భయంకరమైన ఘటన.. వీడియో చూస్తే షాక్ అవుతారు!