హనుమాన్ దేవాలయంలో ముస్లిం పూజారి.. అక్కడ ఎందుకు ఉన్నారో తెలుసా..?

సాధారణంగా ఎంత పెద్ద దేవాలయమైనా, వీధిలో చిన్ని గుడి అయినా అందులో పూజారి( Poojari ) ఉండడం సర్వసాధారణమే అని అందరికీ తెలుసు.

ఆయన నిత్యం పూజలు చేయడం దేవాలయానికి వచ్చే భక్తులకు దేవుని ఆశీర్వాదాలు అందించడం చేస్తూ ఉంటారు.

అయితే ఏ దేవాలయంలో అయినా పూజారి హిందువులే ఉంటారు అని కచ్చితంగా చెప్పవచ్చు.

బ్రాహ్మణ, వైష్ణవ కులాలకు చెందిన వారు సాధారణంగా పూజారులుగా అనేక దేవాలయాలలో విధులు నిర్వహిస్తూ ఉంటారు.

కానీ ఒక దేవాలయం లో పూజారి హిందువు కాదు.ఆ దేవాలయంలో ఒక ముస్లిం( Muslim Poojari ) 10 సంవత్సరాలుగా పండితులుగా విధులు నిర్వహిస్తున్నారు.

"""/" / ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.కర్ణాటక రాష్ట్రం( Karnataka ) గదగ్ జిల్లా లక్ష్మేశ్వర్ సమీపంలోని కోరికొప్ప హనుమాన్ దేవాలయం( Korikoppa Hanuman Temple ) ఉంది.

150 సంవత్సరాలుగా ముస్లింలు పూజారువులుగా విధులు నిర్వహిస్తున్నారు.ఎందుకంటే ఇది గతంలో వారికి హిందూ సోదరులు ఇచ్చిన ప్రత్యేక హక్కు.

ఈ దేవాలయ విశిష్టత ఏమిటంటే ముస్లింలు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి హనుమంతుని విగ్రహాన్ని పూజిస్తారు.

ముస్లిలు దేవాలయం మొదలైనప్పటి నుంచి పూజలు నిర్వహిస్తున్నారు.కోరికొప్పలో ఎప్పుడూ మత ఘర్షణలు జరగకుండా హిందువులు, ముస్లింలు శాంతియుతంగా జీవిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు.

"""/" / పూర్వం కోనేరికొప్ప, కొండికొప్ప, కోరికొప్ప గ్రామాల ముఖద్వారం వద్ద చిన్న హనుమాన్ ఆలయం( Hanuman Temple ) ఉండేది.

కోనేరికొప్ప, కొండికొప్ప ఈ గ్రామాల ప్రజలు గతంలో ప్లేగు, కలరా వ్యాధులు వచ్చి వలసలు వెళ్లడంతో ఇప్పుడు ఉనికి లేదు.

ఈ గ్రామాల నుంచి ప్రజలు వలస వచ్చినప్పుడు సమీపంలోని పుటగావ్ బద్ని గ్రామానికి చెందిన కొన్ని ముస్లిం కుటుంబాలు దేవాలయంలో పూజలు కొనసాగించాయి.

ఆ తర్వాత దేవాలయాన్ని పునరుద్ధరించే తదితర కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను కోరికొప్ప గ్రామ పెద్దలు ముస్లింలకు అప్పగించారు.

ఆ ఆనవాయితీ ఇప్పటి వరకు అలాగే కొనసాగుతూ ఉంది.అలాగే శ్రావణమాసంలో ( Shravanamasam ) కులమతాలకు అతీతంగా గ్రామస్తులు అందరూ ఒక చోట చేరి దేవాలయంలో హోమాలు, భజనలు చేస్తారు.

ముఖం మొత్తం మచ్చలేనా.. ఖరీదైన క్రీముల కంటే ఎఫెక్టివ్ గా పనిచేసే రెమెడీ మీకోసం!