ఇండియా అనే దేశం ఉందా.. కొరియన్ టాక్సీ డ్రైవర్ డౌట్‌కు యువతి షాక్.. వీడియో వైరల్..
TeluguStop.com
భారతదేశం గురించి ఓ కొరియన్ టాక్సీ డ్రైవర్( Korean Taxi Driver ) చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో నవ్వులు పూయిస్తున్నాయి.
ఇండియా( India ) అనే దేశం నిజంగా ఉందా అని ఆ డ్రైవర్ అమాయకంగా అడగడం అందర్నీ విస్మయానికి గురించి చేస్తుంది, ఒక భారతీయ మహిళకు, అతనికి మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ వీడియో వైరల్( Viral Video ) అయిపోయింది.
నవ్వుతూ, ఆశ్చర్యపోతూ నెటిజన్లు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.సియోల్‌లో ఫ్యాషన్, బ్యూటీ కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తున్న పియూష పాటిల్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
పియూషకి టాక్సీ డ్రైవర్లతో ఇలాంటి వెరైటీ కబుర్లు పెట్టడం కొత్తేం కాదు.కానీ ఈసారి డ్రైవర్ మరీ వింతగా మాట్లాడటంతో వెంటనే ఫోన్ తీసి రికార్డ్ చేసింది.
వీడియోలో డ్రైవర్.పియూషాని ఎక్కడి నుంచి వచ్చావమ్మా అని అడుగుతాడు.
"ఇండియా" అని పియూష చెప్పగానే, డ్రైవర్ ముఖం వెలిగిపోయింది."ఇండియానా? అదెక్కడ ఉంది?" అని అమాయకంగా అడిగాడు.
పియూష నవ్వి ఇండియా.చైనా, పాకిస్థాన్ దగ్గరలో ఉంటుందని చెప్పబోతుంటేనే.
డ్రైవర్ కట్ చేస్తూ "ఓహ్, ఇండోనేషియానా?" అంటూ మరింత కన్ఫ్యూజ్ అయ్యాడు. """/" /
పియూష గట్టిగా నవ్వి "కాదు కాదు, ఇండియా" అని మళ్లీ క్లారిటీ ఇచ్చింది.
అయినా డ్రైవర్ నమ్మలేదు."అసలు ఇండియా అనే దేశం ఉందా? అక్కడ జనాలు ఎంతమంది ఉంటారు?" అని డౌట్ పడ్డాడు.
పియూష కూల్ గా "భారతదేశమే ప్రపంచంలోనే నంబర్ 1 పాపులేషన్ కంట్రీ.చైనాను కూడా దాటేశాం" అని చెప్పడంతో డ్రైవర్ షాక్ అయ్యాడు.
"చైనా జనాభానే 130 కోట్లు ఉంటారనుకున్నా" అంటూ నోరెళ్లబెట్టాడు."అవును, కానీ ఇండియా జనాభా ఇంకా ఎక్కువే" అని పియూష కన్ఫర్మ్ చేయడంతో, చివరికి డ్రైవర్ నమ్మక తప్పలేదు.
"ఓకే ఓకే, ఇండియా ఉందంటే ఉండి ఉంటుందిలే" అంటూ తేల్చేశాడు. """/" /
ఇంతటితో ఆగకుండా వెంటనే టాపిక్ మార్చి, పియూషాని సౌత్ కొరియాలో( South Korea ) ఏం చేస్తుందో, ఏ యూనివర్సిటీలో చదివిందో అడగడం మొదలుపెట్టాడు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో క్షణాల్లో వైరల్ అయిపోయింది.డ్రైవర్ అజ్ఞానానికి నెటిజన్లు నోరెళ్లబెట్టారు.
కొందరు డ్రైవర్ జోక్ చేశాడా అని కామెంట్స్ పెడుతుంటే, మరికొందరు తమకు కూడా ఇలాంటి ఫన్నీ ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నాయని చెప్పారు.
చైనీస్ మాట్లాడే వాళ్లు చాలామంది ఇండియాను, ఇండోనేషియాని కన్ఫ్యూజ్ అవుతారని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.
ఏదేమైనా ఈ వీడియో మాత్రం నెటిజన్లకు కడుపుబ్బా నవ్వించింది.అంతేకాదు, కల్చరల్ అవేర్‌నెస్ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది.