కొరటాల శివను విలన్ లా చూస్తున్న ఇండస్ట్రీ.. చచ్చేంత ప్రేమ కథను కొరటాల నిజంగా చదవలేదా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరటాల శివ( Koratala Shiva ) 80 శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు.
మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న కొరటాల శివ ఈ సినిమాలతో అద్భుతమైన మెసేజ్ కూడా ఇచ్చారు.
అయితే ఆచార్య సినిమా( Acharya Movie ) ఫ్లాప్ కావడం, ఈ సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగల్చడంతో కొరటాల శివ ఇలాంటి సినిమా తీశాడేంటని కామెంట్లు వినిపించాయి.
అదే సమయంలో శ్రీమంతుడు కాఫీరైట్ వివాదంలో కొరటాల శివ క్రిమినల్ కేసును ఫేస్ చేయాలంటూ వేర్వేరు కోర్టులు ఇచ్చిన తీర్పులు హాట్ టాపిక్ అవుతున్నాయి.
కొరటాల శివ ఒక సినిమా కథను కాపీ కొట్టాడని ప్రచారం జరగడంతో ఆయన ఇతర సినిమాలు కూడా కాపీ ఏమో అంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
మరో విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీ కొరటాల శివను విలన్ గా చూస్తోంది. """/" /
అయితే ఒకే ఆలోచన ఇద్దరు రచయితలకు వచ్చే అవకాశాలు ఉంటాయి.
యాదృచ్ఛికంగా ఇద్దరు రచయితలు ఒకే విధంగా ఆలోచించి ఒకే తరహా సినిమాలు తీసే అవకాశాలు ఉంటాయి.
తెలుగులోనే ఒక సినిమాను పోలి సేమ్ కథతో తెరకెక్కి హిట్టైన సినిమాలు సైతం ఉన్నాయి.
కొరటాలశివ చచ్చేంత ప్రేమ అనే కథను తాను చదవలేదని ఈ ఆరోపణలు వ్యక్తమైన సమయంలో వెల్లడించారు .
"""/" /
కొరటాల శివను అభిమానించే వాళ్లు సైతం ఆయన తప్పు చేశారంటే నమ్మడం లేదు.
చచ్చేంత ప్రేమ కథకు శ్రీమంతుడు సినిమాకు పోలికలు ఉన్నా నూటికి నూరు శాతం పోలికలు లేవు.
విల్సన్ చచ్చేంత ప్రేమ కథకు రచయిత కాగా శరత్ చంద్ర అనే కలం పేరుతో ఆయన నవలలు రాశాడు.
కొరటాల శివ ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్9, బుధవారం 2025