బిజినెస్ మాన్ గా మారిన కొరటాల..దేవర కోసం అంత రిస్క్ చేస్తున్నారా..?

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ( Koratala Siva )డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా కోసం ఇప్పటికే కొరటాల శివ తన దైన రీతిలో ఏ సినిమాకి తీసుకోనన్ని రోజులు ఈ సినిమాకి తీసుకొని ఈ సినిమాని చెక్కుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ ను ఫినిష్ చేసి గుమ్మడికాయ కొట్టాలని కొరటాల శివ చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఆచార్య తో భారీ దెబ్బ తిన్న కొరటాల శివ ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.

"""/" / తద్వారా తను కూడా పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది.కానీ కొరటాల శివ ఇప్పుడు బిజినెస్ మాన్ గా మారి భారీ రిస్క్ చేస్తున్నారట.

ఇక తెలుగులో కొన్ని ఏరియాలని కొరటాల శివ నే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడని కూడా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో తాను భారీ సక్సెస్ ను అందుకుంటాడనే విషయంలో సరైన క్లారిటీ లేనప్పటికీ ఆయన కూడా బిజినెస్ మాన్ గా మారడం విశేషం.

"""/" / ఇక రీసెంట్ గా వచ్చిన క్రిష్టమ్మ సినిమా( Krishnammaకి ) కూడా ప్రజెంటర్ గా వ్యవహరించి బిజినెస్ డీల్ ని కుదుర్చుకున్న ఆయన ఆ సినిమా ఆశించిన మేరకు ఫలితం అందించకపోవడంతో కొద్ది వరకు నిరాశ చెందాడు.

కానీ దేవర సినిమా ఆయనదే కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుంది అనే నమ్మకం తనకు ఉంది కాబట్టి ఈ సినిమా కి సంబంధించిన రైట్స్ ని తను తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది.

చూడాలి మరి కొరటాల శివ ఈ సినిమా తో సక్సెస్ కొడితే ఆయన కి రెండు రకాలుగా యూజ్ అవుతుంది.

దేవర నైజాం,ఆంధ్ర బిజినెస్ లెక్కలు ఇవే… అన్ని కోట్లు వస్తేనే సేఫ్?