ఆచార్య పాన్ ఇండియా.. అందుకే రిలీజ్ చెయ్యడం లేదంటున్న కొరటాల!

ప్రెసెంట్ చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు ఎవ్వరి నోటా విన్న పాన్ ఇండియా పేరే వినిపిస్తుంది.

అలాగే మన తెలుగు సినిమాలో బాలీవుడ్ లో ఏ స్థాయిలో రాణిస్తున్నాయో అందరం చూస్తూనే ఉన్నాం.

మన హీరోలు వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తూ బాలీవుడ్ హీరోలను సైతం భయపెడుతున్నారు.

ఒకదాన్ని మించి మరొక సినిమా ఉండేలా పాన్ ఇండియా లెవల్లో సినిమాలు రిలీజ్ చేయడమే కాదు.

అక్కడ ఆ సినిమాలు అదరగొడుతున్నాయి.అందులో భాగంగానే చాలా సినిమాలు మొదట తెలుగు లోనే ప్లాన్ చేసి మళ్ళీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పాన్ ఇండియా గా రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు రిలీజ్ కు రెడీగా ఉన్న ఆచార్య సినిమా కూడా పాన్ ఇండియా అని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై తాజాగా డైరెక్టర్ కొరటాల శివ స్పందించారు.ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చేసారు.

ఈ సినిమాను మొదటి నుండి తెలుగు కి సంబంధించిన సినిమాగానే చెయ్యాలి అని అనుకున్నాం అని కానీ తర్వాత ప్లాన్ మారడంతో పాన్ ఇండియా చర్చలు అయితే వచ్చాయి.

కానీ మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కాస్త గజిబిజి క్రేజ్ ను క్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో ఇప్పుడే పాన్ ఇండియా రిలీజ్ వద్దని అనుకున్నాం అని కొరటాల చెప్పుకొచ్చారు.

"""/"/ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన సినిమా ఆచార్య.

ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

ఇందులో రామ్ చరణ్ సిద్ధ అనే పవర్ ఫుల్ రోల్ లో నటించాడు.

చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తే రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.

చిరు, చరణ్ ఇద్దరు కూడా ఈ సినిమాలో కలిసి నటించడం వల్ల ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

మరి ఈ సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

ఫ్లోరిడా హైస్కూల్లో అద్భుత ఘటన.. ఒకేసారి అంతమంది కవలలు పట్టా పొందారు..??