ట్యాక్స్ ట్యాక్స్ పేయర్ల కు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించాల్సిందే.. కొరటాల శివ డిమాండ్..?

టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్లలో కొరటాల శివ ఒకరు.

రైటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన దర్శకుడిగా మారి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నాడు.

మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో తీసే కొరటాల శివ తాజాగా మాత్రం ఊర మాస్ సినిమాతో ముందుకు వచ్చాడు.

అదే "దేవర" సినిమా( Devara" Movie ).ఈ సినిమా వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడికి మించిన కలెక్షన్స్ వసూలు చేసింది.

మూవీ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కొరటాల శివ( Koratala Shiva ) ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ ఇంటర్వ్యూను మాజీ IAS అధికారి జయప్రకాష్ నారాయణన్( Jayaprakash Narayan ) హోస్ట్ చేశారు.

జయప్రకాశ్ నారాయణన్, కొరటాల శివ సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు ఇతర ముఖ్యమైన విషయాలు కూడా చర్చించారు.

అలా మాటలో మాట వచ్చే కొరటాల శివ పన్ను చెల్లింపుదారుల గురించి కొన్ని కామెంట్స్ చేశారు.

శివ చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా( Social Media)లో వైరల్ గా మారాయి.

"""/" / శివ ట్యాక్స్ పేయర్ల గురించి, వారికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు, హక్కులు ఎలా ఉండాలనే దాని గురించి మాట్లాడారు.

ట్యాక్స్ ప్లేయర్లకు ఎందుకు ప్రత్యేకమైన అధికారాలు లేదా ప్రయోజనాలు ఇవ్వాలని తాను ఎందుకు డిమాండ్ చేస్తున్నారో కూడా ఆయన తెలిపారు.

ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న ఓ ఇన్సిడెంట్ ను పంచుకుంటూ, శివ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

శివ మాట్లాడుతూ “సాధారణంగా, నేను ఎక్కడా లైన్లను స్కిప్ చేయను.ఎయిర్‌పోర్ట్స్‌కు కూడా రెండు గంటల ముందుగానే వెళ్తాను.

కానీ ఓ సందర్భంలో ఎయిర్‌పోర్ట్‌కి పరుగెత్తుకుంటూ వెళ్లాను.ఆ సమయంలో చెన్నైలో ఒక మీటింగ్ ఉంది.

ఇంకా వేరే చోట్ల పనులు కూడా ఉన్నాయి.షెడ్యూల్ చాలా టైట్‌గా ఉంది కాబట్టి నా చెక్-ఇన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఒక ప్రోటోకాల్ అధికారి నన్ను తనతో తీసుకెళ్లారు.

“సరిగ్గా అదే సమయంలో లైన్‌లో నిలబడి ఉన్న ప్రయాణీకులలో ఒకరు అరిచి, లైన్‌లో నిలబడకుండా హాయిగా వెళ్తున్నారేంటి అని నన్ను ప్రశ్నించారు.

నాకు కోపం వచ్చి అతని మీద తిరిగి అరిచాను.నేను ఏటా దాదాపు రూ.

4 కోట్ల ట్యాక్స్ పే చేస్తాను.కాబట్టి నాకు ఈ ప్రత్యేక హక్కు ఉండాలి.

ఈ అధికారాన్ని నన్ను ఆస్వాదించనివ్వండి అని నేను కోపంగా చెప్పాను.నా మాటలు వినగానే అక్కడ ఉన్న కొంతమంది వెంటనే క్లాప్స్ కొట్టారు.

" అని శివ చెప్పుకొచ్చారు. """/" / విమానాశ్రయాల్లో హై ట్యాక్స్( High Tax ) పేయర్లకు ప్రభుత్వం కొన్ని ప్రత్యేకాధికారాలను కల్పించాలని కొరటాల శివ చాలా బలంగా కోరుకున్నారు.

"నేను ఇదే విషయం గురించి ఇన్‌కమ్ టాక్స్‌ డిపార్ట్‌మెంట్ లో పనిచేస్తున్న నా ఫ్రెండ్ ను కూడా ప్రశ్నించా" అని శివ తెలిపారు.

మనదేశంలో ఎక్కువ ట్యాక్స్ కట్టే వాళ్లకి ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తే వారిని చూసి మిగతావారు కూడా అలా బతకాలి అని అనుకోవచ్చు ఇది ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుందని కొరటాల శివ అన్నారు కూడా.

అయితే కొరటాల శివ అభిప్రాయానికి కొందరు మద్దతు తెలుపుతుంటే మరి కొంత మంది మాత్రం అది జరిగే పని కాదని అంటున్నారు.

రానా ఇలాంటి సినిమాలు చేస్తే హీరోగా నిలదొక్కుకోలేడా..?