కొరటాలతో అల్లు అర్జున్… మరో క్రేజీ కాంబినేషన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాతో సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడు.

వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా కావడంతో దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి.

అలాగే రంగస్థలం సూపర్ హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న మరో మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథ ఉండబోతుంది.

చిత్తూరు నేపధ్యంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ ఎలిమెంట్ తో ఈ కథ ఉండబోతుంది అని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే నెక్స్ట్ సినిమా గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.

తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

వరుస హిట్స్ తో సక్సెస్ ఫుల్ దర్శకుడుగా ఉన్న కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.అయితే లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం వాయిదా పడింది.

మరల వచ్చేనెలలో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.లాక్ డౌన్ టైంలో కొరటాల అల్లు అర్జున్ కి ఒక అదిరిపోయే స్టొరీ ఒకటి చెప్పారని, ఈ కథ బన్నీకి కూడా భాగా నచ్చిందని సమాచారం.

ఇక దీనికి బన్నీ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఆచార్య సినిమా మీద దృష్టి పెట్టడంతో దానిని పూర్తి చేసిన వెంటనే బన్నీ కథ మీద వర్క్ అవుట్ చేయాలని కొరటాల ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న గీతూ రాయల్.. 40 ఏళ్లకే చనిపోతారంటూ?